PEN POWER
Newspaper Banner
Date of Publish : 27 June 2026, 4:49 pm Posted By : D Ratnam

మారుమూల గ్రామాలకు మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక చర్యలు: కలెక్టర్ దినేష్ కుమార్

 

రంపచోడవరం, జూన్ 27 (పెన్ పవర్): పోలవరం జిల్లా గుర్తేడు మండలంలోని మారుమూల గిరిజన గ్రామాలకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ తెలిపారు. “నెలకు ఒక నియోజకవర్గం – నాలుగు పర్యటనలు” కార్యక్రమంలో భాగంగా గుర్తేడు గ్రామంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

ప్రజల సమస్యలను గ్రామస్థాయిలోనే తెలుసుకుని తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. తాగునీరు, రహదారులు, విద్యుత్, గృహాలు, పింఛన్లు, ఉపాధి హామీ పనులు, ఆరోగ్య సేవలు, విద్య వంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. గిరిజన ప్రాంతాల్లో సీజనల్ వ్యాధుల నివారణ, గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు.

కార్యక్రమంలో రంపచోడవరం ఎమ్మెల్యే, లెజిస్లేటివ్ చైర్మన్ మిరియాల శిరీష దేవి, జాయింట్ కలెక్టర్ సురపాటి ప్రశాంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.