16వ నెంబర్ జాతీయ రహదారిపై మోచర్ల వద్ద కారు బోల్తా పడిన ఘటనలో ఆరుగురికి తీవ్రగాయాలు అయిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. తెలిసిన వివరాల ప్రకారం విజయవాడ నుండి తిరుపతికి వెళుతున్న ఇన్నోవా కారు (ఏపీ39టీడీ 8378) మోచర్ల గ్రామ సమీపమునకు రాగానే రోడ్డు దాటుతున్న కుక్కను తప్పించిపోయి డివైడర్ ఢీకొని, కారు పల్టీలు కొట్టి జాతీయ రహదారిపై ఎల్లికిలా పడినది. సమీపంలో ఉన్న గ్రామస్తులు హైవే మొబైల్ సిబ్బందికి సమాచారం అందించడంతో హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్న మొబైల్ సిబ్బంది, గ్రామస్తుల సహకారంతో కారును పైకి లేపి యదాస్తితికి తీసుకువచ్చి, అందులో ఉన్న ప్రయాణికులను అతికష్టం మీద బయటకు తీసి 108 వాహనంలో కావలి ఏరియా హాస్పిటల్ కు తరలించారు. ప్రమాదం జరిగినప్పుడు కారులో ఉన్న ఆరుగురులో ఒక మహిళకు చేయి విరగగా, మరో ఇద్దరూ మగవాళ్లకు ఇద్దరికీ తలకు బలమైన గాయాలు, మిగిలిన వారికి తీవ్ర గాయాలు తగిలాయి. గతంలో తరచూ మోచర్ల సమీపంలో ప్రమాదాలు జరుగుతూ ఉండటంతో, అక్కడ పోలీసులు భారీ కేడ్లను పెట్టి, వాటికి రేడియం స్టిక్కర్లు అంటించి, వాహనాలు నిదానంగా వెళ్లేలా చేసి ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టారు. ఎందుకనో ఈ మధ్య వాటిని కూడా తొలగించి వేశారు. ఈ ప్రాంతంలో జరుగుతున్న ప్రమాధాలపై ప్రత్యేక దృష్టి కేటాయించి, ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని స్థానిక గ్రామస్తులు కోరుతున్నారు. ఈ కారు ప్రమాదంపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యప్తు చేపట్టనున్నారు