అవినీతిపరులకు,వ్యక్తిగతంగా రాజకీయ లబ్ధి పొందాలని చూసేవారికి జనసేనలో స్థానం లేదు

  • వకాశవాదులు,స్వార్థపరులకు జనసేనలో అవకాశం ఇవ్వవద్దు   
  • ఏ రోజు పార్టీ కోసం పని చేయని వాళ్ళు ఇప్పుడు హడావిడిలు చేస్తే జన సైనికులు సహించరు 
  • అరకు పార్లమెంట్,పాడేరు అసెంబ్లీ ఇంచార్జ్  *
  • డాక్టర్ వంపూరి గంగులయ్య  
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో డాక్టర్ వంపురి గంగులయ్య

స్టాఫ్ రిపోర్టర్,పాడేరు/గూడెం కొత్తవీధి, పెన్ పవర్,జూలై 16: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో జనసేన పార్టీ అధికారంలో భాగస్వామ్యం అయిననాటి నుండి కొంతమంది అవకాశవాదులు, స్వార్థపరులు,ఏ రోజు పార్టీకి పనిచేయని వాళ్ళు ఏ కార్యక్రమానికి క్రియాశీలక భాగస్వామ్యం కాని వాళ్ళు ఈ మధ్యకాలంలో వివిధ రకాలుగా రాజకీయంగా హడావిడి,హల్ చల్ చేస్తూ జనసేన శ్రేణులపై ఆధిపత్యం పొంది వ్యక్తిగతంగా రాజకీయ లబ్ధి పొందాలని భావిస్తున్నారు. అటువంటి వారిపైన జన సైనికులు అప్రమత్తంగా ఉండాలని అరకు పార్లమెంట్,పాడేరు అసెంబ్లీ జనసేన ఇంచార్జ్ డాక్టర్ వంపూరి గంగులయ్య పిలుపునిచ్చారు.ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ నిజానికి కష్టకాలంలో పార్టీని భుజాలపై వేసుకొని కష్టపడ్డ వారిపై తప్పుడు ప్రచారం చేస్తూ ఇతర పార్టీల నాయకులతో కలిసి చేస్తున్న రాజకీయ కుతంత్రాలపై జనసేన పార్టీ నాయకులు,జన సైనికులు అప్రమత్తంగా ఉండాలి అని అన్నారు. రాజకీయంగా ప్రతి ఒక్కరూ విచక్షణా జ్ఞానం కలిగి ఉండాలి, జరుగుతున్న కుట్రలను, కుతంత్రాలను పసికట్టే ఆలోచన విధానం కలిగి ఉండాలని ఆయన అన్నారు. అలాగే జనసేన పార్టీలో అవినీతి మరకలు లేని, రాజకీయంగా ఎదగాలనుకునే వారు ఎవరైనా ఏ పార్టీ వారైనా చేరవచ్చునని, జనసేన సిద్ధాంతాలకు లోబడి, అదికూడా స్థానిక నాయకత్వం, మండల, నియోజకవర్గ నాయకులతో కలిసి పనిచేస్తూ, ప్రజలు పార్టీ మన్ననలు పొందాలి.ఇది అందరికీ సంతృప్తికరమైన ఆమోదయోగ్యం అవుతుంది అన్నారు. ప్రజాస్వామ్య దేశంలో ఏ రాజకీయ కార్యక్రమాలైనా ఆ యొక్క పార్టీల విధివిధానాలను అనుసరించి కార్యక్రమాలు చేయవచ్చు. ప్రజలతో మమేకం కావచ్చు.కానీ పార్టీ మూల సిద్ధాంతాలకు లోబడే ఉండాలనే షరతుతో మాత్రమేనని గ్రహించాలి అన్నారు.జనసేన పార్టీ ఎటువంటి నియమ నిబంధనాలతో సిద్ధాంతాలతో నడుస్తుందో నీతి,నియమాలు, నైతిక విలువలు,క్రమశిక్షణకు సంబంధించి రోజువారి పార్టీ అధినేత ప్రసంగాలు వింటూనే ఉంటారు అన్నారు. విరుద్ధ భావాలు కలిగిన వ్యక్తులకు ఈ పార్టీలో స్థానం లేదని అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పినట్లుగా రాజకీయ రణక్షేత్రంలో నాయకునిగా నిలబడాలంటే ప్రజలతో మమేకమై ప్రజా సమస్యలపై ప్రత్యక్ష పోరాటం చేయాలి.ఇది నాయకుడిగా మొదటి బాధ్యత అన్నారు. అలా కాదని ప్రజా సమస్యలపై తనదైన శైలిలో పోరాడే నాయకులపై బురద చల్లే ఆలోచన చేయటం రాజకీయాలు కానే కాదు. నాయకుల లక్షణం అంతకంటే కాదు అని అన్నారు. వారు కచ్చితంగా కౌరవ సైన్యాన్ని ముంచిన శకుని వారసులుగా మనం భావించవచ్చు అని అన్నారు.చేతనైతే ప్రజల ఆదరాభిమానాలు పొందాలి కానీ అందుకు విరుద్ధంగా అవకాశవాదులు స్వార్థపరులు జనసేన శ్రేణులపై అజమాయిషి చేస్తామంటే ఊరుకునేది లేదు అన్నారు. అటువంటి పన్నాగాలతో వచ్చే నాయకులని పార్టీలో చేర్చుకునే ప్రసక్తే లేదు. ఈ విషయం మేము చెప్పేది కాదు పార్టీ అధిష్టానం యొక్క మార్గ నిర్దేశం అని గమనించాలని తెలిపారు.పార్టీ నాయకులపై తప్పుడు ప్రచారం చేస్తూ ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని,పార్టీకి నష్టం జరిగే విధంగా ప్రవర్తించే వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం తప్పదు.పార్టీ ఆదేశాల మేరకు నియోజకవర్గ మండల స్థాయి నాయకులు చేపట్టే కార్యక్రమాలు మాత్రమే అధికారికం.వ్యక్తిగత ఎజెండాతో తమకు తామే నాయకులమని తిరిగి వారితో జాగ్రత్తగా ఉండాలని జన సైనికులు వీర మహిళలు జనసేన కార్యకర్తలు ఇది గ్రహించాలని డాక్టర్ వంపూరి గంగులయ్య అన్నారు.

About The Author: CHANTI BABU MADHIRI

అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు.  జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.