ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో సత్తా చాటిన విద్యార్థులు 

IMG-20250412-WA1431 👉🏻కళాశాల టాపర్ గా జీ భువనేశ్వరి 794 మార్కులు.

ముంచంగిపుట్టు,పెన్ పవర్, ఏప్రిల్ 12:అల్లూరి సీతారామరాజు జిల్లా, ముంచంగిపుట్టు మండల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాల్లో జీ భువనేశ్వరి(ఎంపీసీ) 794 మార్కులతో కళాశాల టాపర్ గా నిలిచింది. రెండవ స్థానంలో కే సోమనాథ్ (ఎంపిపి) 777 మార్కులతో ద్వితీయ స్థానంలో నిలువగా, బి గాయత్రి బైపిసి గ్రూప్ 770 మార్కులతో తృతీయ స్థానంలో నిలిచి సత్త చాటారు. ప్రతిభ కనబరచిన విద్యార్థులకు కళాశాల ప్రిన్సిపాల్ కొండన్న దొర అభినందించారు. విద్యార్థులకు తల్లిదండ్రులు, కళాశాల సిబ్బంది, మండలవాసుల నుండి అభినందనలు వెలువెత్తుతున్నాయి.

Tags:

About The Author

CHANTI  BABU MADHIRI Picture

అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు.  జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.