రైతులతో మాటమంతి-నేను రైతు బిడ్డనే:ఎమ్మెల్యే విశ్వేశ్వర రాజు 

స్టాఫ్ రిపోర్టర్,గూడెం కొత్తవీధి,పెన్ పవర్,జులై 20:అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గ ఎమ్మెల్యే మత్స్య విశ్వేశ్వర రాజు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా రైతులు వ్యవసాయ క్షేత్రాల్లో పనుల్లో నిమగ్నమై ఉండటంతో వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించారు.నియోజకవర్గంలో విరివిగా వరి పొలాలలో నాట్లు వేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు.ఎమ్మెల్యే విశ్వేశ్వర రాజు వ్యవసాయ పొలాల దగ్గరకు వెళ్లి రైతుల యొక్క సాధక బాధలను అడిగి తెలుసుకుంటున్నారు.ఆయనే నేరుగా వ్యవసాయ క్షేత్రాల్లో దిగి రైతులతోపాటు పనుల్లో పాల్గొన్నారు.ఆయన పొలం దున్నటమే కాకుండా, పోలంగట్లు వేయటానికి కూడా రైతుకు సహకరించారు.వ్యవసాయంలో శాస్త్రీయ పద్ధతులను పాటించాలని,ఎప్పటికప్పుడు వ్యవసాయ అధికారులను సంప్రదించాలని

దుక్కి దున్నుతున్న ఎమ్మెల్యే విశ్వేశ్వర రాజు

సూచించారు.వర్షాలు అధికంగా పడుతున్నాయి కాబట్టి రైతులు అప్రమత్తంగా ఉండాలని,వరి నారుమళ్ళకు,పొలాలకు పటిష్టంగా గట్లు వేసుకోవాలని సూచించారు.నేను ఓ రైతు బిడ్డ నేనని ఆయన అన్నారు. ఎమ్మెల్యే విశ్వేశ్వర రాజు నేరుగా వ్యవసాయ క్షేత్రంలో దిగి పనులు చేయటంతోపలువురు ఆయనను అభినందిస్తున్నారు.

About The Author: CHANTI BABU MADHIRI

అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు.  జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.