చంద్రబాబు మాట తప్పరు పింఛన్లు పంపిణీలో ఎమ్మెల్యే జగదీశ్వరి
ఉదయం 6 గంటల నుండి పింఛను పంపిణీ కార్యక్రమం చేపట్టిన ఎమ్మెల్యే జగదీశ్వరి
పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన గ్రామాల్లో తెల్లవారి 6 గంటలకే ప్రారంభమైన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం.వీధుల్లో వెళ్లి వృద్దులకు,వికలాంగులకు, వితంతువులు కు పింఛన్లు సచివాలయ సిబ్బంది, తెలుగుదేశం పార్టీ నాయకులు పంపిణీ చేశారు..కురుపాంలో ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి,రాష్ట్ర కార్యదర్శి వీరేష్ చంద్రదేవ్ నేరుగా వెళ్లి ఫించన్ డబ్బులును లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు.అనంతరం ఫించన్ దారులుతో కలిసి చంద్రబాబు, పవన్, మోదీ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జగదీశ్వరి మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం వృద్ధాప్య, వితంతు పింఛన్ 3000 నుండి 4000కి, వికలాంగులు పింఛన్ 3000 నుండి 6000 పెంచి ఇచ్చిన ఘనత చంద్రబాబు, పవన్,మోదీలదే అని ఆమె అన్నారు.
About The Author
మన్యం జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.