పీఎం జన్ మన్ పథకంలో గృహాలకు
గూడెం కొత్తవీధి,పెన్ పవర్, సెప్టెంబర్ 03:పీఎం జన్ మన్ పథకానికి సంబంధించి పివిటిజి గ్రామాలలో నూతన గృహాల నిర్మాణం కొరకు అర్హులైన లబ్ధిదారులను గుర్తించటానికి సర్వే వేగవంతం చేయాలని అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధి మండలం,పెదవలస పంచాయతీకి చెందిన సర్పంచ్ పాంగి కృష్ణవంశీ ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.అన్ని రంగాలలో వెనుకబడిన పివిటిజి లకు విద్య,వైద్యం, రోడ్డు మంచినీరు ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేయాలని కోరారు. పలు పివిటిజి గ్రామాలలో నేటికి నేటికీ సరైన రోడ్లు,మంచినీటి సదుపాయం, పాఠశాలలు లేవని వీటన్నిటిని గుర్తించి మౌలిక సదుపాయాల కల్పనకు, గృహ నిర్మాణాలకు, ప్రభుత్వం చొరవ చూపాలని కృష్ణవంశీ కోరారు.