స్కూల్ షెడ్డు నిర్మించాం - పిల్లల చదువు కోసం టీచర్ ను పంపండి

IMG-20240714-WA0010👉తంగెళ్లబంద గిరిజనుల అభ్యర్థన  

స్టాప్ రిపోర్టర్,పాడేరు,గూడెం కొత్తవీధి,అనంతగిరి,పెన్ పవర్,జూలై 14: అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం కివర్ల పంచాయతీలోని తంగేళ్ల బంధ గ్రామానికి విద్యార్థుల చదువు కోసం ఉపాధ్యాయుడిని నియమించాలని గ్రామస్తులు కోరుతున్నారు.ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.తంగేళ్ల బంధ గ్రామంలో కొండదొర ఆదివాసీ గిరిజనులు 28 కుటుంబాలు నివసిస్తున్నారు.సుమారు 26 మంది పిల్లలు వారి చదువుల నిమిత్తం రోజు రెండు కిలోమీటర్లు నడిచి వెళ్లి పి. గంగవరం గ్రామంలో మండల ప్రాథమిక పాఠశాలలో చదువుతున్నారు.పిల్లలు ఎండనకా వాననక రోజు సుమారు రాను పోను నాలుగు కిలోమీటర్ల దూరం వాగుల్లో వంకల్లో నడిచి వెళ్లి చదువుకోవాల్సిన దుస్థితి. ఇటీవల కాలంలో భారీ వర్షాలు కారణంగా విద్యార్థులు కాలువలు దాటలేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయంపై ఆందోళన చెంది విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన నిర్వహించారు.ఈ విషయం వివిధ మాధ్యమాల్లోనూ, పత్రికలలోనూ వార్తలుగా వచ్చాయి.జిల్లా కలెక్టర్ స్పందించి స్థానిక ఎంఈఓ ను తంగెళ్ల బంధ గ్రామానికి పంపించారు.మండల విద్యాశాఖ అధికారి గ్రామస్తుల తో పాఠశాలకు ప్రత్యామ్నాయంగా గ్రామస్తులు ఒక రేకుల షెడ్డును నిర్మించుకుంటే పాఠశాల మరియు భాష వాలంటరీ నియామకానికి జిల్లా అధికారులకు నివేదిక ఇస్తామని ఎంఈఓ తెలిపారు. గ్రామస్తులంతా ఏకమై చందాలు వేసుకుని శ్రమదానం చేసి వారం రోజుల్లో పాఠశాల కోసం రేకుల షెడ్డు ను నిర్మించారు.గ్రామస్తులు జులై 5వ తారీఖున పాడేరులో మీకోసం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ను కలిసి తమ గ్రామానికి ఉపాధ్యాయుడను నియమించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా తెంగేళ్ల బంధ యువజన సంఘం నాయకుడు పాండవుల సత్యారావు మీడియాతో మాట్లాడుతూ అధికారుల సూచనల మేరకు విద్యార్థుల చదువు కొరకు రేకుల షెడ్డు ను నియమించటం జరిగిందని కావున జిల్లా కలెక్టర్,ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి,ఇతర ఉన్నతాధికారులు స్పందించి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని తక్షణమే ఉపాధ్యాయుని నియమించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామస్తులు,విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Tags:

About The Author

CHANTI  BABU MADHIRI Picture

అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు.  జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.