రబ్బరు స్టాంప్ ఎమ్మెల్యేలతో ఆదివాసీ అభివృద్ధి శూన్యం

గంగవరం (అల్లూరి జిల్లా)

రబ్బర్ స్టాంపు ఎమ్మెల్యేలతో ఆదివాసి ప్రాంతం అభివృద్ధి శూన్యమని ఆదివాసి చట్టాలు అమలు కొరకే పోరాడే నాయకున్ని చట్టసభలకు ఎన్నుకోవాలని ఆదివాసి సంక్షేమ పరిషత్ (ఏ ఎస్ పి) ఎమ్మెల్యే అభ్యర్థి కుంజా శ్రీను అన్నారు.

ఆదివారం న ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో  అంబేద్కర్  గారి జయంతి ని పురస్కరించుకొని పాత గంగవరం లోని అంబేద్కర్ విగ్రహానికి  పూల మాల వేసి నివాళ్లు అర్పించారు. 
   ఈ సందర్బం గా ఆయన మాట్లాడుతూ  ఆదివాసీ రిజర్వేషన్ తో ఎస్ టి నియోజకవర్గం లో  రాజకీయ పార్టీల తరుపున పోటీ చేసే  ఒక అభ్యర్థి అయినా  జీవో 3 గురించి,  1/70,  గురించి  అక్రమ కట్టడాలు గురించి,  నకిలీ సర్టిఫికెట్ గురించి మాట్లాడు గలరా?  ఓట్ల కోసం మీ దగ్గరకి వచ్చే గిరిజనేతర  పార్టీల తరుపున పోటీ చేసే అభ్యర్థులు ని ప్రశ్నించండి అని అన్నారు.  అలాగే  జీవో 3 రద్దు అయినపుడు,    బోయ వాల్మీకులను ఎస్టి లో కలపాలని తీర్మానం చేసినప్పుడు ఎందుకు అసెంబ్లీ లో మాట్లాడలే దో  అధికార పార్టీ ఎమ్మెల్యేలను , రాజకీయం పార్టీలను ప్రశ్నించండి అని ఆయన పిలుపునిచ్చారు . సంక్షేమ పథకాలు పేరుతో మసిబూసి మారేడు కాయ చేస్తున్నారు తప్ప ఇప్పటి వరకు మారుమూల ఆదివాసీ ప్రాంతాలకు  ఎటువంటి మౌలిక సదుపాయాలు కల్పించలేదు అని ఆయన విమర్శలు చేశారు.  

అయినా ఇప్పుడు ఆదివాసీ లకు కావాల్సిన వి  సంక్షేమ పథకాలు కాదు,  హక్కులు అని అన్నారు.  ఆ హక్కులు దక్కాలి అంటే చట్టాలు అమలు కావాలి అని అన్నారు,  చట్టాలు అమలు కావాలి అంటే వాటి గురించి పోరాడే ఆదివాసీ నాయకున్ని చట్ట సభ కి పంపాలని ఆదివాసీలని కోరారు. ఆదివాసీలు అభివృద్ధి కేవలం చట్టాలు అమలు తోనే సాధ్యం అన్నారు. ఆదివాసీ రిజర్వేషన్ తో గెలిచి నాన్ ట్రైబల్ అనుకూల అభ్యర్థులను గెలిపిస్తే ఆదివాసీభవిష్యత్తు తరాల మనుగడ ప్రశ్నర్డకమే! అని అన్నారు.  ఆదివాసీ భవిష్యత్తు కొరకు పోరాడే తనకు ఒక అవకాశం  ఇచ్చి అసెంబ్లీ కి పంపిస్తే ఆదివాసీలకు దక్కాల్సిన  రాజ్యాంగ హక్కులు దక్కేలా కృషి చేస్తాను అని హామీ ఇచ్చారు.  ఈ కార్యక్రమం లో  ఆదివాసీ సంక్షేమ పరిషత్ నాయకులు పీట ప్రసాద్, చోడి ప్రదీప్ కుమార్, చోడి ఏడుకొండలు, చూర్ల సత్యనారాయణ, తమ్మారావు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

About The Author: D. RATNAM