సీలేరు వైద్యాధికారిపై చర్యలు తీసుకోవాలి

👉

ఎంపీటీసీ అంపురంగి బుజ్జిబాబు

గాలికొండ ఎంపిటిసి అంపురంగి బుజ్జిబాబు  

గూడెం కొత్తవీధి,పెన్ పవర్, జూలై16:చిన్నారుల తల్లిదండ్రులపై కేకలు వేసిన సీలేరు వైద్యాధికారి పై చర్యలు తీసుకోవాలని గాలికొండ ఎంపీటీసీ బుజ్జిబాబు డిమాండ్ చేశారు.స్థానిక విలేకరులతో మంగళవారం మాట్లాడుతూ జీకే వీధి మండలం సీలేరులో నివాసం ఉంటున్న స్వామి రమణ కుమారులు ఇద్దరు కు వాంతులు విరోచనాలు జ్వరంతో బాధపడుతూ ఆదివారం రాత్రి 11 గంటలకు వైద్య సేవ నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళ్లారని పేర్కొన్నారు. ఆస్పత్రిలో నర్స్ పిల్లలు అనారోగ్య పరిస్థితి పై ఫోన్ చేసి వైద్యాధికారికి వివరించింది.వైద్యాధికారి వారి స్థితిగతులపై అడగకుండా వైద్య సేవలు అందించడానికి సత్వర చర్యలు చేపట్టకుండా వైద్య అధికారి తల్లిదండ్రులపై కేకలు వేయడం ఎంతవరకు సమంజసమని బుజ్జిబాబు ప్రశ్నించారు.ఇంత రాత్రి పై తీసుకురావడం ఏమిటని వైద్య అధికారి ఆసుపత్రికి వచ్చి చిన్నారులకు వైద్య సేవలు అందించకుండా ఘర్షణకు దిగడం సరి కాదన్నారు.దీన్ని బట్టి చూస్తే ఏజెన్సీ ప్రాంతం ఆస్పత్రిలో 24 గంటలు వైద్య సేవలు ఎంత బాగా అందుతున్నాయో దీన్ని బట్టి తెలుస్తుందని ఆయన పేర్కొన్నారు.ఈ విషయంపై కలెక్టర్ స్పందించి డాక్టర్ పై విచారణ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎంపీటీసీ బుజ్జిబాబు డిమాండ్ చేశారు.

About The Author: CHANTI BABU MADHIRI

అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు.  జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.