అంగన్వాడీ కేంద్రాలపై పర్యవేక్షణ లోపం
చిన్నారులకు చేరాల్సిన పౌష్టికాహారం వ్యాపారులకు చేరుతోంది
అల్లూరి జిల్లా బాలల హక్కుల పరిరక్షణ ఫోరమ్ సభ్యలు
గూడెం కొత్తవీధి,పెన్ పవర్, జూలై 18: చిన్నారులకు చేరాల్సిన పౌష్టికాహార సరుకులు అంగన్వాడీ కేంద్రాల నుంచి వ్యాపారులు వీటిని కొనుగోలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.అంగన్వాడీ కేంద్రాలపై పర్యవేక్షణ కొరవడటంతో చిన్నారులకు చేరాల్సిన పౌష్టికాహారం వ్యాపారులకు చేరుతోందని అల్లూరి జిల్లా బాలల హక్కుల పరిరక్షణ ఫోరమ్ సభ్యులు పేర్కొన్నారు.అంగన్వాడి కేంద్రాలకు వచ్చే సరుకులు బయటకు అమ్మిన,కార్యకర్తలు సరిగ్గా పనిచేయకపోయినా కఠిన చర్యలు తీసుకుంటామని అల్లూరి జిల్లా కలెక్టర్ ఒకవైపు ప్రకటించిన అంగన్వాడీ కేంద్రాలలో పంచే పౌష్టికాహారం పక్కదారి పడుతోంది.అల్లూరి సీతారామరాజు జిల్లా,గూడెం కొత్త వీధి మండలం,దారకొండ పంచాయితీ కమ్మరి తోట గ్రామంలో మంగళవారం రాత్రి సమయంలో అక్రమంగా తరలిస్తున్న అంగన్వాడీ కేంద్రాల సరుకులను గ్రామస్థులు అడ్డుకున్నారు. దారకొండకు చెందిన వ్యాపారికి గుడ్లు,పాలు తరలిస్తున్నారని గ్రామస్థులు గుర్తించి నిలదీశారు.ఈ ఘటనకు సంబంధించి రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది.ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నియమించిన ప్రాథమిక విచారణ కమిటీ పూర్తిస్థాయిలో లబ్ధిదారులు,గ్రామస్తులతో విచారణ చేయాలని కోరుతూ బాల బాలికలకు, బాలింతలు,గర్బవతులకు పుష్టికరమైన ఆహారము (సంపూర్ణ ఆహారము)అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా మెరుగైన పోషకార అందేలా అంగన్వాడి కార్యకర్తలు నెలవారి సరుకులు లబ్ధిదారులకు సక్రమంగా అందిస్తున్నారా లేదా అనేది ఐసీడీఎస్ అధికారి, సూపర్వైజర్లు పర్యవేక్షించాలని,బాధ్యతను మరిచి అడ్డుదారిన అక్రమంగా అమ్మకాలకు పాల్పడినటువంటి అంగన్వాడీ టీచర్ పైనా విచారణ చేసి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇటువంటి ఘటన పునరుద్దం కాకుండా లబ్ధిదారులకు సక్రమంగా అందేలా జిల్లా ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారి పర్యవేక్షించాలని బాలల హక్కుల పరిరక్షణ ఫోరమ్ జిల్లా కో కన్వీనర్(అల్లూరి జిల్లా) కె.బిలాస్కర్,అల్లూరి రూరల్ కన్వీనర్ ఆర్. విద్యాసాగర్, జీకే వీధి మండల కన్వీనర్ యం.సోమేష్ కుమార్,చింతపల్లి మండలం మహిళ కన్వీనర్ కె. వెంకయ్యమ్మ పత్రిక ప్రకటనలో పేర్కొన్నారు.