అన్నీ తానై.. కుటుంబానికి పెద్ద దిక్కై ఆదర్శంగా నిలిచిన మహిళా జానకి

స్టాఫ్ రిపోర్టర్,పాడేరు/గూడెం కొత్తవీధి,పెన్ పవర్,జులై 3: భర్త అనారోగ్యంతో ఉంటే అన్నీ తానై,ఇంటిపని, వ్యవసాయం,కుటుంబ పోషణ అన్నిటినీ తన బుధస్కందాలపై మోస్తూ ఆదర్శంగా నిలిచింది ఈ గిరిజన మహిళ.గూడెం కొత్తవీధి మండలం అమ్మవారి దారకొండ గ్రామపంచాయతీ పరిధిలో గుంట ఆనందరావు అనారోగ్యంతో బాధపడుతున్నారు. వ్యవసాయ సీజన్ సమీపించడంతో రైతులు దుక్కులు,వరి నారు వేసే సమయం. ఇటువంటి సమయంలో ఆనందరావు అనారోగ్యంతో బాధపడటంతొ వ్యవసాయం పనులన్నీ అర్ధాంతరంగా ఆగిపోయాయి. దీంతో అతని భార్య ఇంటి బాధ్యతలతో పాటు వ్యవసాయ బాధ్యతలను కూడా తన భుజస్కంధాలపై వేసుకుంది.మగవారితో పాటు సమానంగా ఆమె ఏరుపూసి దూకితుండటం ప్రారంభించింది.వ్యవసాయ పనుల్లో,దుక్కి దున్నటంలో పలువురికి ఆదర్శంగా నిలిచింది.మగవారు మాత్రమే దుక్కి దుంటారు అనే అపోహను జానకి తొలగించింది.ఆమెను పలువురు ప్రశంసిస్తున్నారు.

About The Author: CHANTI BABU MADHIRI

అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు.  జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.