స్టాప్ రిపోర్టర్,పాడేరు,గూడెం కొత్తవీధి,పెన్ పవర్,జులై 24: అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిధి అధ్యాపక పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ వనము చిట్టబ్బాయి ఒక ప్రకటనలో తెలియజేశారు.
కళాశాలలో కామర్స్-1, కంప్యూటర్ సైన్స్-1,కంప్యూటర్ అప్లికేషన్-1,లైబ్రరీ సైన్స్-1,మ్యాథ్స్-1,సంబంధించి అతిధి అధ్యాపకులను నియమిస్తున్నట్లు తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఈనెల 27 సాయంకాలం ఐదు గంటల లోపు కళాశాల ఆఫీస్ కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని తెలిపారు.