మంత్రి నాదెండ్ల మనోహర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన డాక్టర్ వి.గంగులయ్య

స్టాఫ్ రిపోర్టర్/పాడేరు/గూడెం కొత్తవీధి,పెన్ పవర్,జులై 9: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ను అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు పార్లమెంట్ జనసేన పార్టీ అధ్యక్షుడు,పాడేరు ఇంచార్జ్ డాక్టర్ వంపూరి గంగులయ్య అమరావతిలో మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్చం అందించి దుస్సాల్వ కప్పి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం అల్లూరి సీతారామరాజు జిల్లాలో నెలకొన్న సమస్యలను గురించి ఆయనకు వివరించారు.ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ అల్లూరి సీతారామరాజు జిల్లాలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలకు మా వంతు పూర్తి సహకారం ఉంటుందని పార్టీ కోసం జనసైనికులు నిర్విరామ కృషి చేయాలన్నారు. క్రమశిక్షణతో పనిచేసిన నాయకులకు, వీర మహిళలకు తగిన గుర్తింపు ఉంటుందని వివరించారు.
About The Author

అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు. జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.