స్టాఫ్ రిపోర్టర్,గూడెం కొత్త వీధి/చింతపల్లి,పెన్ పవర్ 26: మహాశివరాత్రి సందర్భంగా అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం అంతర్ల గ్రామంలో సోమలింగేశ్వర స్వామి ఆలయం ఆలయానికి ఉదయం నుండి భక్తులు అధిక సంఖ్యలో రావటం జరిగింది. నేషనల్ హైవే నుండి కొండపైన గల సోమలింగేశ్వర స్వామి గుడి వరకు భక్తులతో కళకళలాడింది. భక్తులు ఉదయం నుండి భక్తిశ్రద్ధలతో సోమలింగేశ్వర స్వామిని దర్శించుకుంటున్నారు. ఎటువంటి అవంచనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ, మరియు ఉత్సవ కమిటీ సభ్యులు చర్యలు చేపట్టారు.