గూడెం కొత్తవీధి,పెన్ పవర్,అక్టోబర్ 19:అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్త వీధి మండలం దామనాపల్లి పంచాయతీ కట్టుపల్లి గ్రామంలో ఎంపీపీ బోయిన కుమారి, స్థానిక సర్పంచ్ కుందేరి రామకృష్ణ,ఎంపీడీవో ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో ఫ్రైడే డ్రై డే కార్యక్రమాన్ని నిర్వహించారు. క్లాత్ మిత్రులతో డ్రైనేజీని దగ్గరుండి శుభ్రం చేయించి బ్లీచింగ్ వేయించారు..తుప్పలను తొలగించారు. అనంతరం ఎంపీడీవో ఉమామహేశ్వరరావు దావనపల్లి పంచాయతీలో సచివాలయ కేంద్రాన్ని సందర్శించి రికార్డులను పరిశీలించారు.