ప్రాణాలు అరచేత పెట్టుకొని కాలువ దాటాల్సిందే
👉నిత్యవసర సరుకుల కోసం సంతకు వస్తే కాలువ దాటటమే యమగండం
👉అధికారులను విన్నవించిన పట్టించుకోని అధికారి యంత్రాంగం
👉ప్రభుత్వాలు మారుతున్నాయి బ్రిడ్జి మాత్రం వెయ్యరు
(
స్టాఫ్ రిపోర్టర్ మాదిరి చంటిబాబు)గూడెం కొత్తవీధి,పెన్ పవర్, జూలై 15: అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధి మండలం అమ్మవారి దారకొండ పంచాయతీకి చెందిన గొల్లపల్లి,పెబ్బంపల్లి, తడకపల్లి గ్రామస్తులకు సరైన రహదారి సౌకర్యం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. వారు సోమవారం నిత్యవసర సరుకుల కొరకు ఆర్ వి నగర్ సంతకు వచ్చి తిరిగి వెళుతూ కాలువను దాటటానికి ప్రాణాలను అరచేత పట్టుకొని కాలువ దాటాల్సి వస్తుంది. వంచులా పంచాయతీ చామగడ్డ మీదుగా అమ్మవారి దారకొండ పంచాయితీ పెబ్బంపల్లి,తడకపల్లి, గొల్లపల్లి గ్రామాలకు వెళ్లాలి. ఈ మార్గం గుండా వెళ్లాలంటే వర్షాకాలం బిక్కుబిక్కుమంటూ ప్రయాణం చేయాలి. వర్షానికి వాగులు పొంగి ప్రవహిస్తూ ఉంటాయి. అయినా ప్రజలు నిత్యవసర సరుకుల కొరకు ఆర్ వి నగర్, లేదా చింతపల్లి రావలసి ఉంటుంది.భారీ వర్షాలు పడితే ఈ గ్రామాల ప్రజలకు ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోతాయి. వాగులకు బ్రిడ్జిలు లేకపోవడం వలన కాలువలు పొంగి ప్రవహిస్తూ ఉంటాయి. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల వలన వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. నిత్యవసర సరుకుల కోసం వచ్చి కాలువలు దాటుతున్న పలువురు గతంలో కాలువలో కొట్టుకుపోయినట్లు పలువురు తెలుపుతున్నారు. అయినా బ్రతకటం కొరకు, లేదా ఆస్పత్రి కొరకు, ప్రభుత్వ కార్యాలయాలకు ప్రాణాలు అరచేత పట్టుకొని ప్రజలు ఈ కాలువను దాటాల్సి వస్తుంది. ప్రభుత్వాలు మారుతున్నాయి. కానీ మా బ్రతుకులు మారటం లేదు. గత వైసిపి ప్రభుత్వం పెబ్బంపల్లి తడకపల్లి గొల్లపల్లి రహదారికి కాలువలో బ్రిడ్జి నిర్మించి రోడ్డు నిర్మిస్తామని వాగ్దానం ఇచ్చింది కానీ చేసింది లేదు. నూతన ఎన్డీఏ ప్రభుత్వమైనా మా సమస్యను పరిష్కరించి,రోడ్డు,
బ్రిడ్జి నియమించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
About The Author
అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు. జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.