మన్యం వీరుడు అల్లూరికి ఘన నివాళి అర్పించిన ఎమ్మెల్యే

స్టాఫ్ రిపోర్టర్,పాడేరు /గూడెం కొత్తవీధి,పెన్ పవర్,జూలై 4: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు అల్లూరి జిల్లా పాడేరు కేంద్రంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వర రాజు అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విశ్వేశ్వర రాజు మాట్లాడుతూ  బ్రిటిష్ సైన్యాన్ని వణికించిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు స్వతంత్ర పోరాటంలో జరిపిన సాయుధ పోరాటం,స్వాతంత్ర ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయం.సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం వస్తుందని నమ్మిన వ్యక్తి అల్లూరి. మన గిరిజన ప్రాంత ప్రజలకు స్వాతంత్రం పొందటానికి తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా బ్రిటిష్ సైన్యంతో యుద్ధం చేసి ఎదిరించి తెల్ల దొరలను గడగడ లాడించారు అన్నారు.గిరిజన ప్రాంత ప్రజలతో కలిసి అల్లూరి సీతారామరాజు చేసిన పోరాటాలను గుర్తించి ఈ జిల్లాను అల్లూరి సీతారామరాజు జిల్లాగా  ప్రకటించటం చాలా గర్వపడుతున్నామని అన్నారు. అందుకు మా గిరిజన ప్రాంత ప్రజల తరఫున  మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్,ఎంపీ  డాక్టర్ గుమ్మ తనూజరాణి, అరుకు ఎమ్మెల్యే రేగం  మత్స్యలింగం, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి అభిషేక్, సబ్ కలెక్టర్ దాత్రి రెడ్డి,మాజీ శాసన సభ్యురాలు గిడ్డి ఈశ్వరి పాల్గొని అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఆదర్శం

About The Author: CHANTI BABU MADHIRI

అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు.  జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.