స్టాఫ్ రిపోర్టర్,పాడేరు,గూడెం కొత్త వీధి,పెన్ పవర్,నవంబర్ 5: వినికిడి పరికరాల నమోదు కోసం దీన్ దయాల్ శ్రావణ్ ఫౌండేషన్, జాతీయ ఆరోగ్య మిషన్, ఆర్బీఎస్కే సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 6వ తేదీన వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జమాల్ బాషా సోమవారం తెలిపారు. పాడేరులోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఈ వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వినికిడి పరికరాలు అవసరమైన వారు ఈ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.