ఇంటింటికి తిరిగి రక్త నమూనాలు సేకరిస్తున్న ఆశా కార్యకర్త: పనసల ఈశ్వరమ్మ  

ఇంటింటికి తిరిగి రక్త నమూనాలు సేకరిస్తున్న ఆశా కార్యకర్త: పనసల ఈశ్వరమ్మ   

గూడెం కొత్తవీధి,పెన్ పవర్ జూలై 26: అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్త వీధి మండలంలో గతవారం పది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాతావరణం కలుషితమై అనేకమంది జ్వరాలతోను, విరోచనాలతోనూ, మలేరియా డెంగ్యూ వ్యాధులతో బాధపడుతున్నారు.వ్యాధుల నిర్మూలన కొరకు వైద్యాధికారుల ఆదేశాల మేరకు వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు విస్తృతంగా గ్రామాలలో పర్యటించి వ్యాధుల నిర్మూలనకు కృషి చేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. గూడెం కొత్తవీధి మండలం దామనాపల్లి పంచాయతీ దొడ్డికొండ గ్రామంలో స్థానిక ఆశా కార్యకర్త పనసల ఈశ్వరమ్మ గ్రామంలో పర్యటించి అనారోగ్య సమస్యల పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలను గ్రామస్తులకు వివరించారు.గ్రామంలో ప్రతి వ్యక్తి యొక్క రక్త నమూనాలు సేకరించారు.

IMG-20240726-WA0505
రక్త నమూనాలు సేకరిస్తున్న ఆశా కార్యకర్త ఈశ్వరమ్మ

అనారోగ్య సమస్యలు ఏమైనా ఉంటే తక్షణమే తమకు తెలియజేయాలని 24 గంటలు ప్రజలకు అందుబాటులోనే ఉంటామని ఆమె తెలిపారు.

Tags:

About The Author

CHANTI  BABU MADHIRI Picture

అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు.  జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.