చింతపల్లి పెన్ పవర్, జనవరి 11: వన్ బై సెవెంటీ చట్టాన్ని సడలించాలని శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు చేసిన వాక్యాలకు నిరసనగా గిరిజన సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు బందుకు పిలుపునివ్వడంతో మంగళవారం ఉదయం చింతపల్లి మండలం పెంటపాడు గ్రామంలో చలిని సైతం లెక్కచేయకుండా దండకారణ్య విద్యార్థి సమితి సభ్యులు ప్లా కార్డులు పట్టుకొని నిరసన తెలియజేస్తూ బందులో పాల్గొన్నారు.