పాడేరు అసెంబ్లీ నియోజకవర్గంలో 26 నామినేషన్లు ఆమోదం
పాడేరు/గూడెం కొత్తవీధి,పెన్ పవర్,ఏప్రిల్ 26:
7 నామినేషన్లు తిరస్కరణ
పరిశీలకులు, అభ్యర్ధుల సమక్షంలో పరిశీలన
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా పాడేరు అసెంబ్లీ నియోజకవర్గానికి 23 మంది అభ్యర్ధులు 33 నామినేషన్లను దాఖలు చేసారు.పాడేరు అసెంబ్లీ నియోజక వర్గం రిటర్నింగ్ అధికారి, జే.సి భావన వశిష్ట్ సాధారణ పరిశీలకులు కె. వివేకానందన్, నామినేషన్లు వేసిన అభ్యర్ధులు, వారి ప్రతినిధులు సమక్షంలో శుక్రవారం నామపత్రాల పరిశీలన చేసారు.
33 నామినేషన్లలో 26 నామినేషన్లను ఆమోదించి,7 నామినేషన్లను తిరస్కరించామని రిటర్నింగ్ అధికారి, జే.సి భావన వశిష్ట్ తెలిపారు.నామినేషన్లు పరిశీలన అనంతరం 18 మంది అభ్యర్థులకు చెందిన 26 నామినేషన్లు మిగిలి ఉన్నాయని తెలిపారు. ఈనెల 29వ తేదీ వరకు కార్యాలయపు పనివేళలల్లో ఉదయం 11.00 గంటల నుండి సాయంత్రం 3.00 గంటల వరకు ఉప సంహరణకు గడువు ఉన్నందున నామినేషన్లను ఉపసంహరించు కోదలచినవారు ఉపసంహరించు కోవచ్చునని తెలిపారు.