స్టాప్ రిపోర్టర్,పాడేరు/గూడెం కొత్తవీధి,పెన్ పవర్,ఆగస్టు 22: అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ప్రాంతీయ ఆసుపత్రిని పాడేరు శాసనసభ్యులు మత్స్యరస విశ్వేశ్వర రాజు ఆకస్మికంగా సందర్శించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించి వారికి అందుతున్న వైద్య సేవలను గురించి అడిగి తెలుసుకున్నారు.అనంతరం ఎమ్మెల్యే విశ్వేశ్వర రాజు ఆస్పత్రి సూపర్డెంట్ డాక్టర్ పి. విశ్వామిత్రకు ఆసుపత్రిలో అందిస్తున్నటువంటి వైద్య సేవలను గురించి అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో రోగులకు వైద్యం సరిగ్గా అందించటం లేదని చాలామంది తమకు ఫిర్యాదు చేస్తున్నారని,ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా రోగులకు మెరుగైన వైద్యం అందించాలని ఎమ్మెల్యే విశ్వేశ్వర రాజు సూపర్డెంట్ కు ఆదేశించారు. అలాగే ఆసుపత్రిలో వైద్య సిబ్బంది ఎప్పుడూ అందుబాటులో ఉండేలా చొరవ తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు.