చీడిమెట్ట మెడికల్ క్యాంప్ తనిఖీ చేసిన డిఎంహెచ్ఓ
స్టాప్ రిపోర్టర్,పాడేరు,గూడెం కొత్త వీధి,పెన్ పవర్,జూలై 08: పాడేరు మండలంలోని చీడిమెట్ట్ పివిటిజి గ్రామంలో నిర్వహించిన వైద్య శిభిరాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.జమాల్ బాష సోమావారం తనిఖీ చేసారు.ఈ సందర్భంగా నిర్వహించిన మలేరియా పరీక్షలలో అందరికీ నెగటివ్ వచ్చిందని తెలిపారు.అదేవిదంగా బిపి, షుగర్,హెచ్ బి టెస్టులు నిర్వహించి వారికీ తగు వైద్య సలహాలు,సూచనలు జారీ చేయటంతో పాటు అవసరమైన మందులు అందించారు.ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ మాట్లాడుతూ, వైద్య అవసరాలకు నేటివ్ డాక్టర్లు,మందులు పై ఆధార పడకుండా దగ్గరలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లి చికిత్స తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, డెంగ్యు,మలేరియా లాంటి వ్యాధులు సోకకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మూడ నమ్మకాలు విడనాడాలని,కుటుంబ నియంత్రణ పాటించాలని కోరారు.
About The Author
అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు. జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.