బత్తునూరు ప్రజల డిమాండ్
గూడెం కొత్తవీధి,పెన్ పవర్, జూలై 19:అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధి మండలం గాలికొండ పంచాయితీకి చెందిన బత్తునూరు ప్రజలు తమ గ్రామానికి రోడ్డు, బ్రిడ్జి నియమించాలని కోరుతూ నిరసన తెలిపారు.వారు ఉదృతంగా ప్రవహిస్తున్న కాలువ వద్ద నుంచొని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.గాలికొండ పంచాయతీకి చెందిన బత్తునూరు,పాత్రు గుంట,లేతమర్రి,బుగ్గిరాయి మైనకోట,గొడుగు రాయి గుర్రాల గొంది ఈ ఏడు గ్రామాలకు సంబంధించి సరైన రోడ్డు సౌకర్యం లేదని, ఉన్న ఒకే ఒక ప్రధాన రహదారికి ఉన్న కాలువ వర్షానికి పొంగి ప్రవహిస్తుందని ఎన్నోమార్లు ప్రభుత్వానికి ప్రజా ప్రతినిధులకు అధికారులకు విజ్ఞప్తి చేసిన పట్టించుకోవటం లేదని గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు.గత ప్రభుత్వ హయాంలో బ్రిడ్జి కి సంబంధించి కొలతలు తీసుకున్నారు కానీ పనులైతే చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
రోడ్డు సరిగా లేకపోవడం, బ్రిడ్జి లేకపోవటంతో గర్భిణీ స్త్రీలను, అనారోగ్యంతో బాధపడే వారిని అంబులెన్స్ లో ఆసుపత్రికి చేర్చాలంటే నరకప్ప్రాయమేనని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న పిల్లలు బడికి వెళ్లాలంటే ఈ కాలువ దాటుకొని వెళ్లాలని వర్షం కారణంగా కాలువ ఉధృతంగా ప్రవహిస్తుందని, పిల్లలు ఇంటికి తిరిగి వచ్చేవరకు బిక్కు బిక్కు మంటూ భయంతో గడపాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.కావున ఈ ఏడు గ్రామ ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని నూతన ప్రభుత్వమైన బ్రిడ్జి, రోడ్డు నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు.ఈ కార్యక్రమంలో జర్త కుమారి, జర్త రామారావు,మరిగెల పండన్న,జర్త చంటిబాబు తదితరులు పాల్గొన్నారు.