సీనియర్ మెగా వాలీబాల్ టోర్నీ:ప్రారంభించిన సర్పంచ్ పెట్టెలి దాసుబాబు 

అరకులోయ పెన్ పవర్ 9 :సీనియర్ క్రీడాకారుల స్మారక మెగా వాలీబాల్ టోర్నమెంట్ 2024 అరకువేలీ క్రీడా మైదానంలో బుధవారం ప్రారంభమైంది. నేటి నుంచి ఆదివారం వరకు మూడు రోజులు పాటు సాగే క్రీడా పోటీల్లో పాడేరు డివిజన్లోని 11 మండలాల సీనియర్ క్రీడాకారులు పాల్గొంటున్నారు. ఈ క్రీడా పోటీలను పెదలబుడు సర్పంచ్ పెట్టెలి దాసుబాబు ఎంపీపీ రంజిపల్లి ఉషారాణి, జడ్పిటిసి శెట్టి రోషిణి ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులతో కలిసి వాలీబాల్ ఆడి తమ సంతోషాన్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సర్పంచ్ దాసుబాబు మాట్లాడుతూ సీనియర్ క్రీడాకారుల స్మారక మెగా వాలీబాల్ టోర్నమెంట్ను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ టోర్నీ ఏర్పాటుచేసిన కమిటీకి ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. 11 మండలాల్లో ఉన్న వాలీబాల్ క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొని తమ క్రీడా ప్రతిభను నిరూపించుకునేందుకు తహతహలాడుతుండడం ఎంతో సంతోషదాయకమన్నారు.రూ. 30,000 రూ.20,000 రూ.10000 బహుమతులు గెలుచుకోవాలనే తపన కంటే ఈ క్రీడా పోటీల్లో పాల్గొనాలనే ఉత్సాహం ఎంతమంది క్రీడాకారులను ఇక్కడ వరకు తీసుకొచ్చిందన్నారు. మరోసారి అనేకమంది క్రీడాకారుల కలయికకు ఈ టోర్నీ వేదిక అయిందని పేర్కొన్నారు. అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ క్రీడా పోటీల ప్రారంభోత్సవానికి తనను భాగస్వామ్యం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు.

.

About The Author: CHANTI BABU MADHIRI

అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు.  జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.