రామ కృష్ణ మిషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరం

గంగవరం అల్లూరి జిల్లా

రామకృష్ణ మిషన్ గిరిజన సంచార వైద్య శాల ఆధ్వర్యంలో  ఆదివారం రంపచోడవరం గ్రామ శివారులోని గిరిజన సంచార వైద్యశాలలో ప్రత్యేక వైద్య శిభిరం నిర్వహించినట్లు రామ కృష్ణ మిషన్ కార్యదర్శి స్వామి పరిజ్ఞేయనందజీ మహారాజ్ తెలిపారు. ఈ వైద్య శిబిరంలో రామకృష్ణ మఠం ఆఫీస్ ఇంఛార్జి స్వామీ వేద విద్యానంద మహారాజ్ పాల్గొని వైద్య సేవలు పరిశీలించినారు. డాక్టర్ దాసరి ఉమా మహేష్ , డాక్టర్ తలారి వెంకట సుబ్బారావు, డాక్టర్ సంపత్ కుమార్, పాల్గొని  సుమారు 200మందికి వైద్య సేవలు అందించినట్లు స్వామీజీ తెలిపారు అవసరం అయిన వారికి 49మందికి రక్తపరీక్షలు, ముగ్గురుకి థైరాయిడ్ పరీక్షలు, ఇసిజి ల ఇద్దరికీ 14మందికి ఎక్స్ రే, లు , 11మందికి ఫిజియథెరపీ లు చేసినట్లు స్వామీజి తెలిపారు. వేమగిరి పరమహంస యోగానంద నేత్రలయం  వైద్య నిపుణులు కంటి వైద్యశిబిరం నిర్వహించి నారు .ఈ కంటి వైద్య శిబిరంలో 40మందికి కంటి పరీక్షలు చేసి 08మందికి కళ్లజోళ్లు అందించారు. కంటి ఆపరేషన్ నిమిత్తం 17మందిని పరమహంస యోగానంద ఆసుపత్రికి  తరలించారు.రామ కృష్ణ మిషన్ అందిస్తున్న వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని స్వామీజీ కోరారు. వైద్య శిబిరానికి హాజరైన రోగులకు సహాయకులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు .ఈ వైద్య శిబిరంలో క్యాంప్ కో - ఆర్డినేటర్ కానుమోను శ్రీనివాస్, నక్కా చంటి బాబు మరియు వాలంటీర్  వెంకటలక్ష్మి సిబ్బంది పాల్గొన్నారు.

Tags:

About The Author