స్టాఫ్ రిపోర్టర్ పాడేరు/గూడెం కొత్తవీధి,పెన్ పవర్, మార్చి 10: ఈనెల 12 వ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన యువత పోరు అనే కార్యక్రమం పాడేరు శాసన సభ్యులు అల్లూరి జిల్లా వైసీపీ అధ్యక్షులు మత్స్యరాస విశ్వేశ్వర రాజు, అరకు ఎమ్మెల్యే రేగం మత్యలింగం సారథ్యంలో ఉదయం 09:00 గంటలకు పాడేరు క్యాంప్ కార్యాలయం నుండి విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి ర్యాలీగా వెళ్లి జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించనున్నారు.అదేవిధంగా వైఎస్ఆర్ సీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ చేసి పలు కార్యక్రమాలు చేపట్టనున్నారు.కా