* వృధాగా పోతున్న నీరు రైతుల ఆవేదన! అరణ్య రోదన
* ఏళ్ల తరబడి మరమ్మతులకు నోచుకోని గిరి గ్రామాల చెక్ డ్యాం లు
* బిడు వాడుతున్న వందల ఎకరాల పంట భూములు
* అల్లూరి జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ చెక్ డాములపై దృష్టి సారించాలి
* పాడేరు నియోజకవర్గం ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వర రాజు!
స్టాప్ రిపోర్టార్:మాదిరి చంటిబాబు,పాడేరు/గూడెం కొత్తవీధి,పెన్ పవర్,జులై 6: అల్లూరి సీతారామరాజు జిల్లాలోని గిరి రైతుల వ్యవసాయ పనులకు నీటి సౌకర్యం కోసం గతంలో నిర్మించిన చెక్ డ్యాంలు శిథిలా వస్తా పరిస్థితిల్లో గిరి రైతుల పొలాలకు నీరు అందించలేని పరిస్థితుల్లో ఉన్నాయని వీటిపై అల్లూరి జిల్లా కలెక్టర్ ఎఎస్ దినేష్ కుమార్ ప్రత్యేక దృష్టి సారించాలని అల్లూరి జిల్లా పాడేరు అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వర రాజు కోరారు.అల్లూరి జిల్లా వ్యాప్తంగా ఈ చెక్ డ్యాంలు మరమ్మత్తులకు గురికావడం వలన వాటిని సరైన సమయంలో మరమ్మతులు చేయకపోవడం వలన వేలాది ఎకరాలకు అందాల్సిన నీరు వృధాగా పోవడంతో సకాలంలో రైతులకు నీరు అందక పంటలు పండక తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితిలు అల్లూరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో నెలకొన్నాయని ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రాజు తెలిపారు. అల్లూరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో వర్షాభావ పరిస్థితులలోనూ సమృద్ధిగా నీటి నిలువలు ఈ చెక్కు డ్యామ్ ల వలన గిరి రైతులకు అందుబాటులో ఉండేవని అయితే గతంలో ఏర్పడిన ప్రభుత్వాలు వీటిపై ప్రత్యేక దృష్టి పెట్టి దీనికి సంబంధించి ప్రత్యేక ఇరిగేషన్ డిపార్ట్మెంటును ఏర్పాటు చేసి ఈ చెక్ డ్యాంల నిర్మాణం మరమ్మత్తు పనులు చేపట్టడం జరిగేదని అయితే రాను రాను వీటి మరమ్మతులు,కొత్త నిర్మాణాలు చేపట్టకపోవడం వలన ఏజెన్సీలో నీటి వృధా అధికంగా జరుగుతుందని ఆయన అన్నారు.గతంలో నిర్వహించిన చెక్ డాంలకు పూర్తిస్థాయి మరమ్మత్తులు చేస్తే మళ్లీ అల్లూరి ఏజెన్సీ ప్రాంతంలో గిరి రైతులకు 24 గంటలు నీటి సౌకర్యం ఏర్పడుతుందని దీంతో వర్షాలతో పని లేకుండా నిరంతరం తమ పంటలు పండించుకోవడానికి ఆస్కారం కలుగుతుందని ఎక్కడ చూసినా ఈ చెక్ డ్యామ్ లు పూడికతో నిండిపోయి శిథిలా వ్యవస్థలో ఉన్నాయని కొన్ని ప్రాంతాలలో రైతులే తమ సొంత నిధులు వెచ్చించి ఈ చెక్ డాములను మరమ్మతులు చేసుకుంటున్నారని ఇప్పటికైనా అల్లూరి జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ స్పందించి మరమ్మత్తుకు గురైన చెక్ డ్యామ్ల వివరాలను సేకరించి వాటిని ఈ ఖరీఫ్ సీజన్లో రైతులకు నీరు అందే విధంగా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే విశ్వేశ్వర రాజు కోరారు.ప్రస్తుతం వ్యవసాయ సీజన్ ప్రారంభం అవుతున్న దృశ్య ఎటువంటి నీటి కొరత లేకుండా అధికారులు చర్యలు తీసుకొని అన్ని ప్రాంతాలలో ఏర్పాటు చేసిన చెక్ డాంలను పూర్తిస్థాయిలో పునర్నిర్మాణం చేసి రైతులకు 24 గంటలు నీరు అందే విధంగా చూడాలని ఎమ్మెల్యే విశ్వేశ్వర
రాజు కోరారు.