లోక్‌సభ ఎన్నికలు… సగం టికెట్లు నేర చరితులకే
Lok Sabha Elections… Half the tickets are for criminals
సార్వత్రిక ఎన్నికల తొలిదశలో దాదాపు సగం స్థానాల్లో నేర చరితులే ఎక్కువగా పోటీ పడుతున్నారని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్ విశ్లేషించింది.
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల తొలిదశలో దాదాపు సగం స్థానాల్లో నేర చరితులే ఎక్కువగా పోటీ పడుతున్నారని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్ విశ్లేషించింది. మొత్తం 102 స్థానాలకు గాను 42 సీట్లలో ముగ్గురు లేక అంతకంటే ఎక్కువ మంది నేర చరితులు ప్రధాన పార్టీల తరఫున ఎన్నికల బరిలో నిలిచారని తెలియజేసింది. 1618 మంది ఎన్నికల అఫిడవిట్లను పరిశీలించింది.
అందులో 252 మందిపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయని, వారిలో 161 మందిపై తీవ్రమైన నేరాభియోగాలు ఉన్నాయని వెల్లడించింది. 35 మందిపై విద్వేష ప్రసంగాల కేసులు ఉన్నాయని, 41 శాతం సీట్లలో రెడ్ అలర్ట్ ప్రకటించారని పేర్కొంది. 28 మంది అభ్యర్థులు కోటీశ్వరులని, ఆర్‌జేడీ, డిఎంకె, ఎస్పీ, టిఎంసి అభ్యర్థుల్లో 40 శాతం మంది ఏదో ఒక నేరానికి పాల్పడిన వారేనని తెలిపింది.