ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ తప్పనిసరి:పాడేరు డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్: వనుము చిట్టబ్బాయి  

హెల్మెట్ యొక్క అవశ్యకతను విద్యార్థులకు వివరిస్తూ

 స్టాప్ రిపోర్టర్/పాడేరు/గూడెం కొత్తవీధి, పెన్ పవర్,జూలై 22: ఉన్నత విద్యా కమిషన్ వారి ఆదేశాల మేరకు పాడేరు డిగ్రీ కళాశాల యందు జాతీయ సేవ పథకం ఎన్ఎస్ఎస్ వారి ఆధ్వర్యంలో ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలను గురించి, శిరస్త్రానము( హెల్మెట్ ) ధరించటం వల్ల కలిగే ఉపయోగం గురించి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రిన్సిపల్ వనుముు చిట్టబ్బాయిి మాట్లాడుతూ విద్యార్థులు ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు నడిపిన వారు, కూర్చున్న వారు కూడా హెల్మెట్ ధరించాలని హెల్మెట్ ధరించడం వలన అనుకోని ప్రమాదం జరిగితే తలకు గాయాలు కాకుండా రక్షణ ఏర్పడి ప్రాణాలు కాపాడుకోవచ్చునని తెలిపారు. అలాగే 18 సంవత్సరాలు దాటిన వారు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ చేయించుకోవాలని సూచించారు.ఐక్యూ ఏసీ కోఆర్డినేటర్ పి కోటేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి ఎన్ఎస్ఎస్ వాలంటర్ ట్రాఫిక్ నిబంధనలు, హెల్మెట్ వాడకంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. ఎన్ఎస్ఎస్ సీనియర్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ బి.రమేష్ బాబు మాట్లాడుతూ ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ ధరించాలని,వాలంటీర్లు తరచూ ప్రమాదాలు జరగకుండా తీసుకోవలసిన జాగ్రత్తలను గురించి ప్రజలలో అవగాహన కల్పించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ జి.గౌరీ శంకర్,జి.దామోదర్,గణేష్,భాస్కర్,వి.శంకర్రావు,జి.గోవిందరావు,సౌజన్య,నిర్మల,సుమిత్ర,జానకిరామ్,అచ్యుత్ ఇతర సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.

About The Author: CHANTI BABU MADHIRI

అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు.  జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.