దళిత జర్నలిస్ట్ గోడువిన్న యన్సీయస్సీ కమీషన్

చౌడేపల్లి

30 రోజులలో కేసునమోదుచేసి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ

ఆంద్రప్రదేశ్ రాష్ట్రం ,చిత్తూరు జిల్లా,చౌడేపల్లి మండలం,చౌడేపల్లి నడిబొడ్డున గల శ్రీ కాశీవిశ్వేశ్వర స్వామి మాన్యం,శ్రీ వేణుగోపాల స్వామి మాన్యం ఆక్రమణకు గురైనదని,దీనిని దేవాదాయ శాఖ,పట్టించుకోలేదని,ఇటు రెవిన్యూ అధికారులు పట్టించుకోలేదు,అటు దేవాదాయ శాఖ అధికారులు పట్టించుకోలేదు.ఈ విషయం పై వరుస వార్తాకథనాలు రాసిన ఉత్తరాది హరిప్రసాద్ అను జర్నలిస్టు దళిత యస్సి మాలసామాజిక వర్గానికి చెందినవాడని తెలిసికూడా   ఏ ఊరు రా నీది,పెన్ను నీది,పేపర్ నీది ఏమి రాస్తావో రాసుకో నువ్వు నా పంచి,షర్టు కూడా పీకలేవు అని అనడం,అక్రమ నిర్మాణాలను ఫోటోలు తీయ్యడానికి వెళ్తే ఎవడైనా వస్తే నరికేస్తాం అని ఆక్రమణ దారుడు అనడం,వరుసకథనాలు రాస్తున్నాడని,చరవాణిలో బెదిరించడం వంటివాటిపై నేషనల్ కమీషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్ (యన్.సి.యస్సి) కి పిర్యాదు చేయడం జరిగినదని.పిర్యాదు నెంబర్ :ఏపిసిఆర్/ఓయల్/ఏ.పి/2024/247370 గా నమోదుచేసి మొదటి నోటీసును చిత్తూరు జిల్లా సూపరిటెండెంట్ ఆఫ్ పోలీసువారికి 30 రోజులలో కేసునమోదు చేసి,విచారణ చేసి,తీసుకున్న చర్యలు తమ కార్యాలయానికి పంపాలని 02-05-2024 న ఆదేశాలు పంపించారు.సమాచారం తెలియజేయడానికి ఉత్తరాది హరిప్రసాద్ కు కూడా ఒక కాపీ పంపించారు.ఈ సందర్బంగా ఉత్తరాది హరిప్రసాద్ మాట్లాడుతూ దళిత జర్నలిస్ట్ గోడు నేషనల్ కమీషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్ వారు విన్నారని,మొదటి నోటీసు పంపడం జరిగినదని,ఈ సమస్య పూలమాన్యం తో ప్రారంభమైనదని అక్కడి నుండి ఎవరెవరు ఎలా మాట్లాడినారో అన్ని ఆడియోలు,విడియోలు కమీషన్ ఎదుట పెట్టడం జరిగిందని,ప్రారంభం లో వెనక ఉండి కథనడిపిన,ఇందులో ప్రత్యక్షం గా,పరోక్షంగా సహకరించిన వారి అందరి పేర్లు ఉన్నాయనిఏ ఒక్కరిని వదిలే ప్రసక్తి లేదని ఈ సమస్య ప్రస్తుతం దళిత జర్నలిస్టులందరిదని,నిజాయితీ గా వార్తాకథనాలు రాసే జర్నలిస్టులదని,కావున జర్నలిస్టు సోదరులు,న్యాయ పోరాటం లో తనకు మద్దతు ఇవ్వాలని ఆయన అన్నారు.

About The Author: PRANAY