సైకిల్ స్పీడు ఆపనున్న హస్తం

* బూదాల అజితరావు పోటి చేయడంతో తెలుగుదేశానికి ఓట్ల గండీ * తెలుగుదేశం మాజి ఎమ్మేల్యే అభ్యర్ది మూడవసారి కాంగ్రేసు అభ్యర్దిగా పోటి

సైకిల్ స్పీడు ఆపనున్న హస్తం

*యర్రగోండపాలెం రాజకీయంలో అజితరావు ఓటు మార్కు చూపనుందా
* ఇరుపార్టిలలో చేరికలు తిరోగమనం పట్టనున్నాయా

WhatsApp Image 2024-04-10 at 7.01.22 PM (1)
    రాననుకున్నార రాలేనన్నుకున్నారా తెలుగుదేశం పార్టి అధిష్టానం అష్టకష్టాలకు గురిచేసిన పోటిచేయడం పక్కా,అంటు సంకేతాలు ఇస్తున్నా బూదాలఅజితరావు ఎట్టకేలకు యర్రగొండపాలెం నియోజకవర్గ కాంగ్రేసుపార్టి అభ్యర్దిగా ఎన్నికల బరిలో నిలిచింది.గతంలో 2014,2019 ఎన్నికలలో తెలుగుదేశం పార్టి తరుపున పోటి చేసి ఓటమిచెందిన అజితరావు ,మూడవసారికూడా తెలుగుదేశం పార్టి తరుపున పోటిచేసేందుకు సిద్దపడిన విషయం తెలిసిందే.ఈ నేపధ్యంలో నియోజకవర్గ ఇన్ చార్జీగా ఉన్న గూడూరిఎరిక్షన్ బాబును మార్చి అజితరావును అధిష్టానం నియమిస్తుందని ప్రచారం కూడా జరిగింది.రెండు సార్లు ఎన్నికలలో టిడిపి తరుపున పోటిచేసి ఆర్దికంగా నష్టపోయిన అజితరావు,నియోజకవర్గంలో శాశ్విత ఓటుబ్యాంకును పదిలపరచుకోవడమేకాకుండా సానుభూతిని సంపాదించుకుంది.ఈ క్రమంలో తెలుగుదేశంపార్టిలో గ్రూపురాజకీయాలు తారస్దాయికి చేరి ఎరిక్షన్ బాబు మాకు వద్దంటు,అజితరావు కావాలంటు చంద్రబాబు,లోకేష్ లవద్ద పంచాయితి పెట్టడం అందరికి తెలిసిందే.టిడిపి ని నమ్ముకుని రెండు సార్లు పోటిచేస్తే మరో అవకాశం ఇవ్వకుండా చంద్రబాబు మోసం చేసారని ఆమె వర్గం టిడిపిపై అంసతృప్తితో వైసిపిలో చేరడం కూడా జరిగింది.తెలుగుదేశం పార్టి అధిష్టానం గూడూరి ఎరిక్షన్ బాబే అభ్యర్ది అని మార్చేది లేదని తేల్చిచెప్పడంతొ, బూదాల అజితరావు స్వతంత్ర అభ్యర్దిగా పోటిచేసేందుకు సిద్దపడటం,ఆ పై బిసివై పార్టిలో చేరుతుందని ప్రచారం జరగడం విశేషం.యర్రగోండపాలెం నుండి ఎన్నికల బరిలోకి దిగేందుకు సిద్దపడ్డ అజితరావు షర్మిళ సమక్షంలో కాంగ్రేసు పార్టిలో చేరడం,యర్రగోండపాలెం అభ్యర్దిగా బరిలోకి దిగడంతో రాజకీయం వేడేక్కింది.
* అజితరావు ప్రభావం టిడిపిపైనే
        బూదాల అజితరావు తెలుగుదేశం పార్టి మాజి ఎమ్మేల్యే అభ్యర్దిగా నియోజకవర్గ ప్రజలకు పరిచయమున్న పేరే.రెండు దఫాలు ఎన్నికల్లో పోటిచేసి ప్రతి పల్లేలో ప్రచారం నిర్వహించిన ఆమె, ప్రస్తుతం హస్తంగుర్తుతో మళ్ళి ప్రజలలోకి వస్తుండటంతో ,తెలుగుదేశంపార్టి ఓట్లను ఆమె చీల్చనున్నదని,వైసిపి కంటే టిడిపిపై ఆమె ప్రభావం ఉంటుందనేది భహిరంగ చర్చ.గత ఎన్నికల్లో ఆమెకు 66 వేల చిలుకు ఓట్లు వచ్చాయని,ఈ ఎన్నికల్లో ఆమె అభిమానులు,సాను బూతిపరులు బూదాల అజితరావు వైపు దృష్టి సారిస్తే దాదాపు 20 వేల ఓట్లకు పైగ ఓట్ల చీలికతొ యర్రగొండపాలెం రాజకీయం గండి కొట్టే అవకాశం లేకపొలేదనేది చర్చ.
* ఆయా పార్టిలలో చేరికలకు తిరోగమనం తప్పదా
         యర్రగోండపాలెం తెలుగుదేశం సిటు అజితరావుకు రాకపొవడంతో అసహనానికి గురైన ఆమె వర్గం వైసిపి లో  చేరడం జరిగింది.అయితే వైసిపిలో చేరిన అజితరావు వర్గం మేము వైసిపిని విడేది లేదంటు కొందరు చెబుతుండగా,అటు టిడిపిని వీడలేక,ఎరిక్షన్ బాబుకు మద్దతు తెలపలేక నిస్తబ్దుగా ఉన్నా అజితరావు వర్గం ఆమె వెంట నడిచెందుకు సిద్దపడుతున్నారు.ప్రస్తుత యర్రగోండపాలెం రాజకీయాలలో మెజారిటి తక్కువైన గెలుపు ఖాయమంటు ఇరు పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నా నేపధ్యంలో అజితరావు కాంగ్రెసు జెండా తో ఎన్నికల బరిలోకి దాగడంతొ మెజారిటి లెక్కలు వేసుకున్న వాళ్ళు చీలిక ఓట్లగురించి చర్చిస్తున్నారు.

About The Author