ప్రజా సంక్షేమమే ధ్యేయంగా జగనన్న పాలన

గంగవరం,

గడపగడపకు సంక్షేమ పాలన అందించిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని రంపచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి అన్నారు ఆదివారం సాయంత్రం గంగవరం మండలంలోని జడేరు, కొరముగుంది, ఏటి పల్లి ,కుసుమరాయి, ఆముదాల బందా, చీడిపాలెం, రాజంపాలెం ,గంగవరం, కొత్త గంగవరం గ్రామాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధనలక్ష్మి ప్రసంగిస్తూ పేద ప్రజల సంక్షేమానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పెద్దపేట వేసిందన్నారు గడపగడపలోని సంక్షేమాన్ని ప్రభుత్వ ఫలాలను ప్రతి ఒక్కరికి అందించడం జరిగింది ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడం జరిగిందన్నారు గంగవరం మండలంలో ఒక్క సంక్షేమ కార్యక్రమాలు ద్వారా సుమారు 135 కోట్ల రూపాయలు లబ్ధిదారుల ఖాతాలో జమ చేయడం జరిగిందన్నారు. కోట్లాది రూపాయలు ప్రజా సంక్షేమానికి ఖర్చు చేయడం జరిగిందన్నారు. సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజల ముంగటకు పాలన అందించి తీసుకువెళ్లడం జరిగింది అన్నారు. నవరత్నాల పరకాల ద్వారా ప్రతి గడపలోనే సంక్షేమం అందించడం జరిగిందన్నారు. రానున్న ఎన్నికలలో మళ్లీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగనన్నను ఆశీర్వదించాలని ధనలక్ష్మి కోరారు. చోడవరం నియోజకవర్గ అభివృద్ధికి తోన శక్తివంచ లేకుండా కృషి చేశానని ఎమ్మెల్యే అన్నారు. గ్రామాల్లో పాఠశాలలో అభివృద్ధి తాగునీటి సమస్య పరిష్కారం మౌలిక సౌకర్యాలు కల్పనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని ఎమ్మెల్యే అన్నారు మారుమూల గ్రామాలను సైతం నేడు అభివృద్ధి వైపు చూస్తున్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రంపచోడవరం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన తనను ఎమ్మెల్యేగా అరుకు ఎంపీగా తనుజరాణిని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.

 

సీఎంపై దాడిని ఖండించిన ఎమ్మెల్యే


రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై జరిగిన దాడిని ఎమ్మెల్యే తీవ్రంగా ఖండించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే తో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నల్ల బ్యాడ్జీలు ధరించి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. 
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ అప్పలరాజు, ఎంపీపీ పల్లాల కృష్ణారెడ్డి, జడ్పిటిసి బేబీ రత్నం, వైస్ ఎంపీపీ రామ తులసి ,మోహనాపురం ఎంపీటీసీ వెంకటలక్ష్మి, కో ఆప్షన్ సభ్యుడు కేఎస్ ప్రభాకర్ ,డిసిసిబి మాజీ డైరెక్టర్ 
యజ్జు వెంకటేశ్వరరావు, సర్పంచులు చోడి మల్లికార్జున్ దొర, రామలక్ష్మి , పాయం రాజమ్మ, మండల ఇంచార్జ్ రఘునాథ్, సచివాలయ కన్వీనర్లు కే కృష్ణ తలారి శ్రీను వెంకటేశ్వర్లు దొర తదితరులు పాల్గొన్నారు.

About The Author: Admin