ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రసారమాధ్యమాల పాత్ర అత్యంత కీలకం

కోనసీమ జిల్లా సాధారణ ఎన్నికల పరిశీల కులు రాజేశ్వర్ గోయల్

అమలాపురం,

ఓటర్ల హక్కులు బాధ్యతలను మీడియా గుర్తు చేస్తూ ఉండాలని ఎన్నికల పరిస్థితులు రాజేశ్వర్ గోయల్ సూచించారు. కలెక్టరేట్లోని మీడియా సర్టిఫికేషన్ కోఆర్డినేషన్ మరియు మీడియా సెంటర్ ను అయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సర్టిఫికేషన్ కేంద్రం పనితీరు ఆరా తీసి రికార్డులు ఆధారంగా చెల్లింపు వార్తలు, ప్రసార మాధ్యమాలపై నిఘా వ్యవస్థ పనితీరును  ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయ పార్టీలు, పోటీలో ఉన్న అభ్యర్థులు వివిధ ఎలక్ట్రానిక్ ప్రసార మాధ్య మాల్లో ప్రసారమయ్యే రాజకీయ ప్రకటనలకు ముందస్తు అనుమతిని ఎంసీఎంసీ ద్వారా జారీ చేయాల న్నారు. ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా ప్రశాంత వాతావరణంలో నిర్వహిం చేందుకు మీడియా సహకారంతో అందరూ పూర్తి సమన్వయం వహించాలని సూచించారు.చెల్లింపు వార్తలను ఈ కమిటీ పర్యవేక్షణ తీరు పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు  మీడియా ఉల్లంఘనలను కూడా గుర్తించి ఎప్పటికప్పుడు జిల్లా ఎన్నికల అధికారి సంబంధిత రాజకీయ పార్టీ అభ్యర్థులకు  నోటీసులు జారీ చేస్తూ తగు చర్యలు గైకొనే తీరు బేషూ గ్గా ఉందని ఆయన సంతృప్తిని వ్యక్తం చేశారు. ఎన్నికల నిర్వహణపై పూర్తి సమా చారాన్ని ఎగ్జిబిషన్ మాదిరిగా ప్రదర్శించి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తున్న తీరు బాగుందన్నారు. 
ఎంసిఎంసి కన్వీనర్ కే లక్ష్మీనా రాయణ పలు మీడియా అంశాలను సాధారణ పరిశీలకుల దృష్టికి తెచ్చారు. సామాజిక మాధ్యమాలు వివిధ ఛానల్స్ లో ప్రసారమయ్యే రాజకీయ ప్రకటనలకు సంబంధించి వీడియో రికార్డింగ్ చేస్తూ కోడ్ ఉల్లంఘనలపై సంబంధిత అభ్య ర్థులకు నోటీసులు జారీ చేస్తూ ఆ యొక్క ప్రకటన చార్జీలను అభ్యర్థి ఖాతాలో జమ అయ్యేటట్లు చర్యలు గైకొనడం జరు గుతోందని వివరిం చారు. జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీలు లేదా వారి తరపున ఎన్నిక ల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎలక్ట్రా నిక్ మీడియాలో రాజకీయ ప్రచార ప్రకటనలకు అనుమతి పొందటం కోసం నిర్ణీత నమూనాలో సమర్పి స్తున్నారని తెలిపారు.  అన్ని రకాల టెలివిజన్ ఛానెళ్లు, కేబుల్ నెట్వ ర్క్లు, డిజిటల్ డిస్పేలు, మొబైల్ నెట్వర్క్ ద్వారా ఎస్ఎం ఎస్ లు, వాయిస్ మెసేజ్లు వస్తాయని, సామాజిక మాధ్యమాలైన ఫేస్ బుక్, ట్విట్టర్, యూట్యూబ్, ఇన్స్టాగ్రా మ్, వాట్సాప్, గూగుల్ వెబ్సైట్, వికీపీడియా కూడా ఎలక్ట్రానిక్ మీడియా పరిధిలోకి వస్తాయని పరిశీలకులకు వివరించారు. సినిమా థియేటర్లు, ప్రైవేట్ ఎఫ్ఎం రేడియోలు, ఎలక్ట్రానిక్ పత్రికల్లో ప్రసారమయ్యే, ప్రచురితమయ్యే రాజకీయ ప్రచార ప్రకటనలు కూడా తప్పనిసరిగా ముందస్తు ధ్రువీకరణపొందాల్సి ఉందని అనుమతి పొందిన ఆర్డర్ నంబర్ను సంబంధిత ప్రకటనపై సూచించాల్సి ఉంటుందన్నారు. ఈ విషయాన్ని అన్ని ప్రసార మాధ్యమాలు గమనించాలని సూచించడం జరిగిందన్నారు. ఎంస్ఎంసీ అనుమతి లేకుండా చేసే ప్రసారాలు, ప్రకటనలు ఎన్నికల ప్రవర్తనా నియ మావళి ఉల్లంఘన కింద పరిగణించి భారత ఎన్నికల సంఘం నిబంధనల మేరకు చర్యలు తీసుకోవడం జరుగు తుందని పరిశీలకులకు వివరించారు. 
వార్తాపత్రికల్లోఅయితే పోలింగ్ రోజు, ముందు రోజు తప్పనిసరిగా ఎంసీఎంసీ నుంచి అనుమతి పొందిన తర్వాత మాత్రమే ప్రకటన ప్రచురించాల్సి ఉం టుందని  పరిశీలకులకు తెలిపారు. ఆ రెండు రోజులూ అనుమతి లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ రాజకీయ ప్రకట నలను ప్రచురించడానికి వీలులేదని నిబంధనలు ఉల్లంఘిస్తే ఎన్నికల నియమావళిని అనుస రించి చర్యలు తీసుకోవడం జరుగుతుందని పరి శీలకులకు వివరించారు . ప్రింట్, ఎలక్ట్రానిక్ మరియు సోషల్ మీడియాలో ప్రకటనలు ప్రసారం చేసేటప్పుడు ఎన్నికల కమిషన్ నిబంధనలు తు.చ. పాటించాలని కులాలను, మతాలను కించపరుస్తూ గానీ, అశ్లీలం, ఇతరుల పరువుకు నష్టం భంగం కలిగిస్తూ, హింసను ప్రేరేపిం చరాదని సూచించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో మీడి యా సర్టిఫికేషన్ కమిటీ సభ్యులు సి. బి  సి.క్షేత్రాధికారి పి శ్రీరామ్మూర్తి, సోషల్ మీడియా ఎక్స్పెక్ట్ ఎల్ డి ఎం. కే శ్యాంబాబు తదితరులు పాల్గొన్నారు.

About The Author: Admin