డమ్మీ డాక్టర్ వైద్యం - నిండు ప్రాణం బలి...
బయటపడుతున్నవి ఒకటి రెండే తెలియకుండా ఉన్నవి మరెన్నో
మెడికల్ షాప్ పేరుతో వైద్యం బ్లడ్ టెస్ట్ లు - పట్టించుకోని అధికారులు
పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం
ఏజెన్సీలో అర్హత లేకుండా వైద్యం చేయడం, రక్త పరీక్షలు చేయడం దోచుకోవడం,పేషంట్ ప్రాణాలు పోతే తప్పించుకోవడానికి దారులు వెతుక్కోవడం సాధారణం అయిపోయింది, కురుపాం మండలం గుమ్మ గ్రామానికి చెందిన లాభాల సాయి కృష్ణ (32) కు ఒక్క పూట జ్వరం వస్తే తెలిసిన వాడే కదా అని నమ్మి ఎల్విన్ పేట లో ఉన్న రవి మెడికల్ షాపును సంప్రదించారు ఆయనే ఒక పెద్ద డాక్టర్ గా భావించుకొని రక్త పరీక్షలు చేసి కోర్సులు పెట్టేసి సుమారు మూడు రోజులు మందుల తరవాత ఈ నెల 14 ఆదివారం సాయికృష్ణ కు విరోచనాలు అవ్వడం తో మళ్ళీ డమ్మీ వైద్యుడు తన ప్రతాపం చూపి 15 నిమిషాల్లో పూర్తి అయ్యేలా సిలియన్ బాటిల్ పెట్టి సిలైన్ లో ఏవో ఏవో ఇంజక్షన్ లు ఇచ్చేసరికి మనిషి చలవలు కమ్మి రంగు మారిపోయేసరికి తనకారే ఇచ్చి సోమవారం శ్రీకాకుళం హాస్పిటల్ కు తరలించారు తీరా చూస్తే మార్గ మధ్యలోనే సాయి కృష్ణ మృతి చెందారు.. ఆయన మృతి తట్టుకోలేని భార్య ఏడ్చి ఏడ్చి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి ఆసుపత్రిపాలయ్యారు దీంతో ఒకవైపు ఆమెను చూసుకొని ఈ మరణం పై ఆయన చేసిన తప్పుడు వైద్యంపై ఫైట్ చేయలేని పరిస్థితి కుటుంబ సభ్యులకి ఏర్పడింది, పెళ్లి అయి రెండేళ్లు కూడా అవ్వని పరిస్థితుల్లో యువకుడు మృతి చెందటం అది కూడా వైద్యం వికటించి కోరి చంపుకున్నట్టు భావిస్తున్నారు, ఇదిలా ఉండగా గిరిజన ప్రాంతాల్లో ఇలాంటివి సాధారణమైపోయింది, ఎవరికి వారే ఇష్టానుసారంగా వాహనాలతో గ్రామాల్లో వైద్యులుగా తిరుగుతూ చలమనవుతూ అనేకమంది మరణాలకు కారకులు అవుతున్నారు కానీ వైద్య అధికారులు కానీ పర్యవేక్షణ లేకపోవడం ఒకవేళ ఉన్న కాసులకు కక్కుర్తి పడడంతో ఇలాంటి మరణాలు సంభవిస్తున్నాయి... గట్టిగా నిలబడి తప్పు చేసిన వైద్యుల్ని నిలదీయడానికి కుటుంబ సభ్యులు సంకోచించడానికి కారణం వైద్యుడు ఆ కుటుంబానికి దూరపు బంధువు లేక మధ్యలో ఉన్న కొంతమంది బ్రోకర్లు బెదిరింపులో కారణమని పలువురు భావిస్తున్నారు.. ఇప్పటికైనా ఇలాంటి సంఘటన జరిగినప్పుడు కఠిన చర్యలు తీసుకుని ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలని ప్రజలు కోరుతున్నారు