స్వార్థ రాజకీయాల కోసం వాలంటీర్ల జీవితాలతో ఆటలాడుకుంటున్న వైసీపీ

6 వ డివిజన్ ఎన్నికల ప్రచారంలో కొండబాబు

తమ స్వార్థ రాజకీయాల కోసం వాలంటీర్లు చేత బలవంతపు రాజీనామాలు చేయించి వారి జీవితాలతో వైసిపి పార్టీ నాయకులు ఆటలాడుకుంటున్నారని, ప్రజలకు సేవ చేసే వాలంటీర్లకు తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని కాకినాడ సిటీ అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం జనసేన బిజెపి కూటమి అభ్యర్థి వనమాడి కొండబాబు పేర్కొన్నారు.ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా మంగళవారం స్థానిక 6 వ డివిజన్ నందు కొండబాబు పర్యటించి, ఐదేళ్ల కాలంగా కాకినాడ నగరంలో వైసిపి పార్టీ సాగిస్తున్న అరాచక పాలనను వివరిస్తూ, తెలుగుదేశం ప్రభుత్వం అందించు సంక్షేమ పథకాల మేనిఫెస్టో కరపత్రాలు పంపిణీ చేస్తూ ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ ఉగాది పర్వదిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు వాలంటీర్లకు వేతనాల పెంపుపై  తీపి కబురు అందించడం జరిగిందని, ఉన్నత చదువులు చదివిన నిరుద్యోగ యువత ఆంధ్ర రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు లేక, తన చదివిన చదువుకి తగిన ఉద్యోగం కాకపోయినా ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉండి ప్రజలకు సేవ చేయాలని ఆలోచనతో నిరుద్యోగ యువత వాలంటీర్ల ఉద్యోగంలో చేరి ప్రజలకు సేవలు చేస్తుంటే,  నేడు వైసిపి పార్టీ నాయకులు ఓటమి భయంతో కుట్ర రాజకీయాలు పన్నుతూ  వాలంటీర్లు చేత బలవంతపు రాజీనామాలు చేయించి,  వారిని రాజకీయాలలో కార్యకర్తలగా వినియోగించుకోవడానికి సిద్ధపడడం సిగ్గుచేటని, వాలంటీర్లు వ్యవస్థను తెలుగుదేశం పార్టీ కొనసాగించడం జరుగుతుందని, రాబోయే తెలుగుదేశం కూటమి  ప్రభుత్వంలో వాలంటీర్ల  వేతనాలు 5000 నుండి 10,000 పెంచి, వారికి ఉద్యోగ భద్రత కల్పించడమే కాకుండా వారు చదివిన చదువుకి తగ్గ ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించడం జరుగుతుందని కొండబాబు తెలిపారు. వైసిపి నాయకులు చేస్తున్న కుట్ర రాజకీయాల్లో పడకుండా వాలంటీర్లు జాగ్రత్త పడాలని,  వైసిపి పాలనలో అన్ని వర్గాల ప్రజలు అన్ని విధాలుగా నష్టపోవడం జరిగిందని, గాడి తప్పిన ఏ వ్యవస్థనైనా సరియైన గాడిలో పెట్టాలంటే అది ఒక్క చంద్రబాబు తోనే సాధ్యమని కొండబాబు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, డివిజన్ నాయకులు పోలిపల్లి జగన్, బుంగా నాగరాజు, బొడ్డుపల్లి నాని, శ్రీను, బొంతు సత్యనారాయణ ప్రసాద్, ఏడిద శ్రీను, రాయుడు లక్ష్మణరావు, చిట్నీడి దారా ప్రసాద్, సల్మాన్, బత్తుల ఉమా, దూలపల్లి రవికుమార్, తదితరులు పాల్గొన్నారు.

About The Author: Admin