అమ్మ వార్ల దయతో అందరూ బాగుండాలని, క్రోధినామ సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని డిప్యూటీ సీఎం, దేవదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఆకాంక్షించారు. తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం ఆయన పలు ఆలయాలను సందర్శించారు. అమ్మవార్లను దర్శనం చేసుకున్నారు. తొలుత తాడేపల్లిగూడెం పుర ప్రజల ఇలవేల్పు, గ్రామ దేవత బలుసులమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ముత్యాలంబపురంలోని ముత్యాలమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. తదనంతరం పెంటపాడు లోని పుంతలో ముసలమ్మ అమ్మవారి దర్శనం చేసుకున్నారు. ఆయా ఆలయాల్లో అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చక స్వాముల నుంచి ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగువారి పండుగ ఉగాది అన్నారు. ఉగాది పర్వదినంతో తెలుగు సంవత్సరం ప్రారంభమవుతుందన్నారు. ఈ క్రోధి నామ సంవత్సరంలో ప్రతి ఒక్కరు జీవితంలో సుఖసంతోషాలు, ఆనందం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరు చేపట్టిన ప్రతి పని విజయవంతం కావాలని అమ్మవార్లను కోరుకున్నాను అన్నారు. పిల్లలు బాగా చదువుకుని మంచి ఉత్తీర్ణత సాధించాలని, రైతులు, మహిళలు, వ్యాపారులు, ఉద్యోగులు, చేతివృత్తులు, కార్మికులు....ఇలా వివిధ వర్గాల వారు వారి వారి రంగాలలో ఉన్నత స్థానాలు అధిరోహించాలని అమ్మవార్లను ప్రార్థించాను అన్నారు. ప్రకృతి కరుణించి పంటలు బాగా పండాలని, ప్రతి రైతు కుటుంబం పాడిపంటలతో,సిరి సంపదలతో తులతూగాలని కోరుకున్నానన్నారు. ప్రతి కుటుంబంలోనూ మేలు జరగాలని, అమ్మవార్ల అనుగ్రహం అందరికీ మెండుగా ఉండాలని ప్రార్థించానన్నారు. ప్రతి ఒక్కరు ఆయురారోగ్యాలు, సిరి సంపదలు, అష్టైశ్వర్యాలతో తులతూగాలని మంత్రి కొట్టు సత్యనారాయణ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమాలలో అన్నవరం దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులు గుండుబోగుల నాగు, బొద్దాని విజయలక్ష్మి శ్రీనివాస్, సిజిఎఫ్ కమిటీ మెంబర్ కర్రి భాస్కరరావు, విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థానం ట్రస్ట్ బోర్డు ప్రత్యేక ఆహ్వానితులు చెన్నా జనార్దన్ రావు, కట్రెడ్డి రామకృష్ణ, బలుసులమ్మ గుడి కమిటీ చైర్మన్ కొట్టు అంజిబాబు, ముత్యాలమ్మ గుడి కమిటీ చైర్మన్ మాకా బాలాజీ, పెంటపాడు పుంతలో ముసలమ్మ గుడి కమిటీ సభ్యులు, బలుసులమ్మ గుడి ఉత్సవ కమిటీ సభ్యులు వట్టిప్రోలు రాము, గార్లపాటి వీరకుమార్, వెలనాటి సత్తిబాబు, పెదప్రోలు వెంకట భాస్కరాచార్యులు, అప్పన రమేష్, నున్న శ్రీ రంగనాయకులు, గుంటు బోయిన స్వామి, అడ్డాల నరసింహారావు ముత్యాలమ్మ గుడి కమిటీ సభ్యులు సత్తి నాగేశ్వరరావు, సేనా బత్తుల కుంకులమ్మ, శ్రీనివాసరావు, పెంటపాడు గ్రామ ఉపసర్పంచ్ కొవ్వూరి ప్రసాద్ రెడ్డి, ఎంపీటీసీలు రెడ్డి సూరిబాబు, దేవా బత్తుల నాగమణి, పొట్ల ఏడుకొండలు, ఏఎంసీ డైరెక్టర్లు కర్రి వరహారెడ్డి, సలుమూరి సూర్యప్రకాష్, ముదునూరు సొసైటీ చైర్మన్ బూరాడ శ్రీనివాస్, పెంటపాడు గ్రామ పార్టీ ప్రెసిడెంట్ కే శివ కిరణ్, పండూరి సత్తిబాబు, సొసైటీ డైరెక్టర్ లింగంపల్లి వేమన, కామిశెట్టి వినోద్, వార్డు ఇన్చార్జిలు చామన సూర్యచంద్రరావు, కోడే సత్య శ్రీనివాస్, బలుసులమ్మ గుడి, ముత్యాలమ్మ గుడి ఇవోలు రవిశంకర్, పి హరే రామ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.