"నో ఫ్లై జోన్" గా ఎన్నికల లెక్కింపు కేంద్రం... కలెక్టర్ నిషాంత్ కుమార్

పార్వతీపురం

ఉల్లిభద్ర లో గల  ఉద్యాన కళాశాల పరిసరాలను  "నో ఫ్లై జోన్" గా ప్రకటించడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టరు నిశాంత్ కుమార్ తెలిపారు.  మానవ రహిత వైమానిక వాహనాలు (UAV), డ్రోన్‌లు, బెలూన్‌లు మొదలైన వాటితో సహా ఎలాంటి విమానయాన పరికరాలను ఎగురవేయడం నిషేదించడం జరిగిందని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు.    భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అరకు (ఎస్టీ) పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించి పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుతో సహా పాలకొండ, కురుపాం, పార్వతీపురం, సాలూరు  అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు జూన్ నెల 4వ తేదీన కళాశాలలో ఏర్పాటు చేసిన సంబంధిత కౌంటింగ్ హాళ్లలో జరుగుతుందని చెప్పారు. 4 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి కళాశాలలో స్ట్రాంగ్ రూమ్‌లు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. కళాశాలలో స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద 3 అంచెల భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగిందని, ముందుజాగ్రత్త చర్యగా, భద్రతా ఏర్పాట్లలో భాగంగా  స్ట్రాంగ్‌రూమ్‌లు, కౌంటింగ్ హాళ్ల  భద్రత దృష్ట్యా ఉల్లిభద్ర లో గల  ఉద్యాన కళాశాల పరిసరాలను తదుపరి ఆదేశాలు వరకు "నో ఫ్లై జోన్" గా ప్రకటించడం జరిగిందని జిల్లా కలెక్టరు తెలిపారు.

About The Author: PRANAY