నల్లా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏరియా హాస్పిటల్ లో పేషంట్లకు భోజనాలు పంపిణీ

నల్లా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏరియా హాస్పిటల్ లో పేషంట్లకు భోజనాలు పంపిణీ

నల్లా చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో ట్రస్ట్ చైర్మన్ నల్లా పవన్ కుమార్ గారు ఈరోజు అమలాపురం గవర్నమెంట్ ఏరియా ఆసుపత్రి నందు హాస్పిటల్ సూపర్ వైజర్ శంకరరావుగారి చేతుల మీదుగా 150 మంది హాస్పిటల్ కి వచ్చే ఓపి పేషెంట్ లకు మరియు హెచ్ఐవి వ్యాధిగ్రస్తులకు బోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సందర్భంగా నల్లా పవన్ గారు మాట్లాడుతూ హాస్పిటల్ సుపరెంటైండెంట్ శంకరరావు గారు ప్రతినెల 9 వ తేదీన ఓపీ పేషెంట్ లకు స్కాన్ లు తీస్తామని వారికి భోజన ఏర్పాట్లు చేయమని అడిగారు అని ఆరోజు కూడా ఏర్పాటు చేయుటకు సానుకూలంగా వున్నామని ఆయన అన్నారు. గత మూడు నెలలుగా ప్రతి నెలా మొదటి లేక రెండవ బుధవారం భోజన ఏర్పాట్లు చేస్తున్నామని, సూపరింటెండెంట్ కోరిక మేరకు ప్రతినెలా 9 వ తేదీన కూడా భోజన ఏర్పాట్లు చేస్తామని నల్లా పవన్ గారు అన్నారు. ఈ కార్యక్రమంలో గనిశెట్టి అరవింద్, అయ్యల భాషా, నాగ సుధా కొండ,సలాది నాగేశ్వరరావు, ఏ.ఆర్.టి హాస్పిటల్  డాక్టర్ స్రవంతి,డాక్టర్ రత్నమణి, డేటా మేనేజర్ మరియు  ఏ.ఆర్.టి సిబ్బంది, చేంజస్ విహాన్ సంస్థ కో ఆర్డినేటర్ సందీప్ మరియు సిబ్బంది, హాస్పిటల్ అధికారులు పాల్గొన్నారు.

About The Author