పుల్లలచెరువు పెన్ పవర్ నవంబర్ 15: పుల్లల చెరువు మండలం గారపెంట నరజాముల తండా పంచాయితి మురికిమళ్ళ తండా గిరిజన గ్రామాల్లో గిరిజన నాయకుడు స్వతంత్ర సమరయోధులు భగవాన్ బిర్సా ముండా జయంతిని ఘనంగా నిర్వహీంచారు. ఈ సందర్భంగా పుల్లలచెరువు ఈ వార్డి శ్రీనివాస్ మాట్లాడుతూ గిరిజన నాయకుడు, స్వాతంత్ర్య సమరయోధుడు భగవాన్ బిర్సా ముండా జయంతిని పురస్కరించుకుని.. నవంబర్ 15న భారతదేశం జనజాతీయ గౌరవ్ దివస్‌ను దేశ వ్యాప్తంగా జరుపుకుంటుంది. ఈ రోజున భగవాన్ బిర్సా ముండా జన్మదినాన్ని గౌరవించడమే కాకుండా, గతంలో తరచుగా విస్మరించబడిన భారతదేశంలోని గిరిజన సంఘాల గొప్ప సాంస్కృతిక వారసత్వం, సహకారాన్ని ప్రతిబింభించేలా జనజాతీయ గౌరవ్ దివస్ ను కేంద్ర ప్రభుత్వం ఏటా ఘనంగా నిర్వహిస్తుందని ఆయన అన్నారు.. గిరిజనుల చైతన్యానికి కృషిచేస్తోందని ఆయన అన్నారు.అనంతరం మురికిమల్ల పాఠశాల పరిసర ప్రాంతాలలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో రిసోర్స్ కోఆర్డినేటర్ శామ్యూల్, పంచాయతీ కార్యదర్శలు, సచివాలయ సిబ్బంది పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు గిరిజన గూడెం ప్రజలు పాల్గొన్నారు.