* దోర్నాల కొత్తూరు,ఘంటవానిపల్లిలో తాటిపర్తి ఎన్నికల ప్రచారం
* అపూర్వ స్వాగతం పలికిన ప్రజలు,అభిమానులు
* స్టాఫ్ రిపోర్టర్ యర్రగోండపాలెం పెన్ పవర్ ఏప్రిల్ 10
యర్రగొండపాలెం నియోజకవర్గమే నా కుటుంభమని ,నియోజకవర్గంలోని అన్ని మండాలాల ,అన్ని గ్రామాల అభివృధ్ధికి పాటు పడతానని తనను ఓటువేసి గెలిపించాలని యర్రగొండపాలెం నియోజకవర్గ వైసిపి అభ్యర్ది తాటిపర్తి చంద్రశేఖర్ అన్నారు.బుధవారం దోర్నాల మండలంలోని ఘంటావానిపల్లి, కొత్తూరు,గ్రామాలలో ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి ఇంటిగడప వద్దకు సంక్షేమ పధకాలను అందించాడని,మాటతప్పక ఎన్నికలముందు ఇచ్చిన హామీలను నెరవేర్చిన ఘనత జగనన్నకే దక్కిందని అన్నారు.మీకు కుటుంభాలకు జగనన్న ప్రభుత్వం ద్వారా మంచి జరిగిఉంటే లబ్ది చేకూరి ఉంటేనే మన ప్రభుత్వానికి ఓటు వేయమనీ అడుగడంలో జగనన్న ప్రభుత్వ మంచి మీకు తెలుస్తుందని అన్నారు.ప్రతి అవ్వతాతలకు,వికలాంగులకు ఇంటివద్దకే పెన్షన్ అందించి ఇంటికి పెద్దకొడుకుగా నిలిచాడని అన్నారు.జగనన్న ముఖ్యమంత్రి అయిన ఐదేళ్ళకాలంలొ పేద ప్రజల అభివృధ్ధే లక్ష్యంగా,పేదరిక నిర్మూళనే ద్యేయంగా సంక్షేమ పధకాలు అమలు చేయడం జరిగిందని,నేడు ఆ సంక్షేమ పధకాలు నిజమైన అర్హులకు అందకుండా చేసేందుకు తెలుగుదేశంపార్టి కుట్ర రచన చేస్తుందని అన్నారు.నేడు మీ గ్రామాలలోనే ప్రభుత్వం సచివాలయాలు,రైతుభరోసాకేంద్రాలు,మనఊరికి మనడాక్టర్ పేరిట హెల్త్ క్లీన్ లను,ఏర్పాటుచేసారని వివరించారు.జగనన్నపాలనలో ప్రజాపాలన కోనసాగుతుందని, రాజకీయనాయకుల పెత్తనాలు,జన్మభూమికమీటి లాంటి బ్రోకర్ వ్యవస్దలు లేకుండా,ప్రభుత్వం నేరుగా అర్హులకే పధకాలు అందిస్తుందని,మనకు మంచి చేసే ప్రభుత్వానికి మద్దతుఇచ్చి జగనన్నను మళ్ళి ముఖ్యమంత్రిని చేసుకుందామన్నారు.వైసిపి ఎమ్మేల్యే అభ్యర్దిగా తాటిపర్తి చంద్రశేఖర్ అనే నేను,ఎంపి అభ్యర్ధిగా చేవిరెడ్డిబాస్కరరెడ్డి లు పోటిచేస్తున్నామని ఫ్యాను గుర్తుకు ఓటెసి గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో మండలనాయకులు,కార్యకర్తలు ,గ్రామ ప్రజలు భారిగా పాల్గోన్నారు