పొదిలిలో రౌడీషీటర్లకు పోలీసు అధికారుల కౌన్సిలింగ్

పొదిలిలో రౌడీషీటర్లకు పోలీసు అధికారుల కౌన్సిలింగ్

త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరుగ నున్నందున గురువారం నాడు పోలీసు అధికారులు రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు పొదిలి పట్టణంలోని పోలీస్ స్టేషన్ లో పోలీసు సర్కిల్ ఇన్స్పెక్టర్, డి మల్లికార్జునరావు, సబ్ ఇన్స్పెక్టర్ జి కోటయ్యలు రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయా పోలీస్ అధికారులు మాట్లాడుతూ రౌడీ షీటర్లు సార్వత్రిక ఎన్నికల్లో ఎటువంటి ప్రధాన పాత్ర పోషించరాదన్నారు అలాగే ఎటువంటి హింసాత్మక సంఘటన లకు కూడా పాల్పడకుండా,, హింసాత్మక చర్యలకు దూరంగా ఉండాలని వారు హెచ్చరించారు ఎన్నికల ప్రశాంతతకు రౌడీషీటర్లు భంగం కలిగిస్తే, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడంతోపాటు వారి కదలికలపై ప్రత్యేక దృష్టి సారించాల్సి వస్తుందని పోలీసు అధికారులు మల్లికార్జున్ రావు, కోటయ్యలు హెచ్చరించారు అలాగే సత్ప్రవర్తన తో మెలిగే రౌడీషీటర్ల పై గల స షీట్లను ఎత్తివేసేందుకు తాము ఉన్నత అధికారులకు నివేదికలు పంపించి, సహకరిస్తామని వారు సూచించారు ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది కూడా పాల్గొన్నారు

About The Author

Related Posts