కార్మికులు తమ హక్కుల కోసం ఐక్యంగా పోరాటాలు చేయాలి 

రాష్ట్ర సిఐటియు అధ్యక్షులు ఏవి నాగేశ్వరరావు 


పొదిలి, పెన్ పవర్ జూలై 18:


కార్మికులు తమ హక్కుల కోసం ఐక్యంగా పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర సిఐటియు అధ్యక్షులు ఏవి నాగేశ్వరరావు చెప్పారు. పొదిలి పట్టణ శివారులోని కాటూరి వారి పాలెం గ్రామంలో గల కళ్యాణమంటపంలో రెండు రోజుల నుండి సిఐటియు జిల్లాస్థాయి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. కాగా గురువారం నాడు ఆ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన రాష్ట్ర సిఐటి అధ్యక్షులు నాగేశ్వరరావు మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వంలో కార్మికులకు ఉద్యోగ భద్రత కరువైందని విమర్శించారు మోడీ పాలనలో కార్మికుల హక్కుల కు భంగం కలుగుతుందన్నారు నరేంద్ర మోడీ ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణలు కార్మికుల గొంతులకు బుధి బండలుగా మారుతున్నాయని నాగేశ్వరరావు ఆక్షేపించారు అంతేగాక నరేంద్ర మోడీ పాలనలో హార్దిక అస మానతలు కూడా పెరిగాయని ఆయన విమర్శలు గుప్పించారు నిత్యావసర వస్తువుల ధరలు, గ్యాస్ ధరలు పెరగడం వల్ల ఉద్యోగ , కార్మిక, వ్యవసాయ కూలీల కుటుంబాలు అప్పుల పాలవుతున్నాయని ఆయన తీవ్రంగా దుయ్యబట్టారు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్పొరేట్లకు కొమ్ముకాస్తుందని, 16 లక్షల కోట్లు కార్పొరేట్లకు రాయితీలు ఇచ్చిన మోడీ ప్రభుత్వం కార్మికులు కర్షకుల పై మాత్రం అధిక భారాలు మోపుతోందని నాగేశ్వరరావు ఆక్షేపించారు ప్రభుత్వ రంగ సంస్థల్లో అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్, గౌరవ వేతనం లాంటి పేర్లతో తక్కువ వేతనాలు చెల్లిస్తున్నారని నాగేశ్వరరావు విమర్శించారు చిరుద్యోగులను బెదిరింపులకు పాల్పడితే ఊరుకునేది లేదని, ఈ విషయమై ఆందోళనలు చేపట్టాల్సి వస్తుందని నాగేశ్వరరావు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు ఎం రమేష్ తదితరులు పాల్గొన్నారు.

About The Author: Admin