హెల్మెట్ మీ ప్రాణాలకు రక్షణ
హెల్మెట్ ధరించి సురక్షితముగా వారి గమ్యాలకు చేరుకోవాలి
ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి
మండల న్యాయ సేవాధికార సంస్థ
చైర్మన్ ఏ.ఓంకార్
అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి బి.మేరీ సారా ధానమ్మ
గిద్దలూరు పెన్ పవర్ జులై 18:
హై కోర్ట్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ ' ఆంధ్రప్రదేశ్ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అమరావతి ఆదేశముల మేరకు గిద్దలూరు మండల న్యాయ సేవాధికారసంస్థ ఆధ్వర్యంలో ద్విచక్ర వాహనదారులు ' వెనక కూర్చున్న వారికి హెల్మెట్ ధరించడం ద్వారా ప్రాణ రక్షణ కలిగించుకునే అవగాహన కొరకై గురువారం గిద్దలూరు కోర్టుల ప్రాంగణం నుండి గాంధీ బొమ్మ సెంటర్ 'పెద్ద కూరగాయల మార్కెట్ నుండి కుమ్మరంకట్ట సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఏ.ఓంకార్ ప్రసంగిస్తూ ద్విచక్ర వాహనం నడిపేవారు వారి వెనుక కూర్చున్న వారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించడం ద్వారా ప్రయాణంలో రక్షణ పొందుతారని పేర్కొన్నారు .గిద్దలూరు పట్టణమునందు హైవే ఉండటం వలన ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుందని ద్విచక్ర వాహన దారులు వెనుక కూర్చున్న వారు హెల్మెట్ ధరించి సురక్షితముగా వారి గమ్యాలకు చేరుకోవాలని ఆయన ఉద్గాటించారు. (హెల్మెట్ ధరించండి ~ ప్రాణాలను కాపాడుకోండి ) అనే నినాదంతో ఈ ర్యాలీ నిర్వహించారు .ఈ కార్యక్రమంలో గిద్దలూరు అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి బి.మేరీ సారా ధానమ్మ, గిద్దలూరు స్పెషల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ సెకండ్ క్లాస్ తోట .శ్రీనివాసులు, గిద్దలూరు న్యాయవాదుల సంఘం అధ్యక్షులు పి.న్. శేషశయనారెడ్డి,వైస్ ప్రెసిడెంట్ ఎస్.కె ఉస్మాన్ షరీఫ్ ,సెక్రటరీ ఉదయగిరి మల్లికార్జున రావు, సీనియర్ మరియు జూనియర్ న్యాయవాదులు, గిద్దలూరు సీఐ సోమయ్య ,పారా లీగల్ వాలంటీర్ అద్దంకి మధుసూదన్ రావు, పోలీస్ అధికారులు ' స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు.