శనివారం నాడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలం ఇలాగనూరు గ్రామ పంచాయతీలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. మండల పార్టీ అధ్యక్షులు గాలి మురళినాయుడు మాట్లాడుతూ చంద్రబాబు నాయిడు చేసిన అభివృద్ధి శ్రీరామ రక్ష అని మళ్ళీ చంద్రబాబు నాయుడు సీఎం కావడం తద్యమని నాయకులు కార్యకర్తలు ప్రజల దీవెనలు బాబు గారికి మెండుగా ఉండాలని ఆకాంక్షిచారు. రాష్ట్ర కార్యదర్శి గాలి చలపతి నాయిడు మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి అని అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు అని మళ్ళీ వచ్చే ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ తో గెలుపుంచుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించగల నాయకుడు చంద్రబాబు నాయుడు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు మండల పార్టీ మాజీ అధ్యక్షులు చింతపట్ల భాస్కర్ నాయుడు, రాంబాట్లపల్లి భాస్కర్ నాయుడు, తిరుపతి తెలుగు యువత అధికారప్రతినిధి చెన్ను రాఘవులు యాదవ్, మండల బీసీ సెల్ అధ్యక్షులు సురేంద్ర యాదవ్, యస్సి సెల్ నాయకులు రత్నయ్య, మునిరత్నం. వట్టికుండల జనార్దన్ నాయుడు, సుబ్రహ్మణ్యం, ప్రభాకర్, హరి, మహేష్, తాతయ్య, జనార్దన్ రెడ్డి, రాజగోపాల్, బాలకృష్ణ, సుశేఖర్ నాయిడు, తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నవారిలో వున్నారు.
ఘనంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 74వ జన్మదిన వేడుకలు.
శ్రీకాళహస్తి