మాల మహానాడు కు సిద్ధం కావాలి

దళితరత్న మాటూరి చిన్నారావు 

విశాఖ పెన్ పవర్ జూలై 16 :  ఒకే తల్లి బిడ్డల మధ్య చిచ్చు రేపుతూ స్వార్థ ప్రయోజ నాలకు వర్గాలుగా విభజించేవారిని దృష్టిలో ఉంచుకొని  మాలమహానాడు నడుం బిగించా లని  రాష్ట్ర మాల మహానాడు సీనియర్ నేత, దళిత రత్న మాటూరి చిన్నారావు అన్నారు. సోమవారం విశాఖ పారిశ్రామిక ప్రాంతం మల్కా పురంలో మాటూరి చిన్నారావు మాలమహా నాడు ఐక్య వేదికకు ఆయన సారధ్యం వహించి మాట్లాడారు.  సమావేశం జరిగింది. యువజన నాయకుడు తంతటి సంపత్ అధ్యక్షతన మాల మహానాడు సమీకరణ సమావేశంలో దళిత నేత కొత్తపల్లి వెంకటరావు మాట్లాడుతూ రిజ ర్వేషన్లు ఏళ్ల తరబడి అనుభవిస్తున్నారని ఎడ్చేవారని రోడ్డుపై దళితులు చెప్పులు కొట్టు కుంటూ, పారిశుద్ధ్య పనులుచేస్తూ జీవిస్తు న్నారు.  అధిక శాతం ఓట్లు ఉన్న దళితుడు  సీఎం , డిప్యూటీ సీఎం ఎందుకు కాలేక పోయా డో ఆలోచించాలన్నారు. కారం చెడు, చుండూ రు నుండి రాజకీయాలతో ఎస్సీలను దొంగ దెబ్బతో కొట్టి చంపారని అన్నారు. ఇప్పటికైనా మాలలు చరిత్ర తెలుసుకుని త్యాగాలకు,పోరా టాలకు సిద్ధంగా మాలమహానాడు బలోపేతా నికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గాజువాక ఆర్టీసీ డిపో ఉద్యోగ విరమణ సందర్భంగా దళిత నేత ధర్మారావు కు ఘనంగా సత్కరించారు. అనంతరం మళ్ళీ పారి శ్రామిక ప్రాంతంలో మాలందరినీ సమీకరించి సమావేశం ఏర్పాటు చేస్తానని తెలిపారు. 
ఈ కార్యక్రమంలో పారిశ్రామిక ప్రాంతం మాల మహానాడు కార్యకర్తలుగా దేవ గాంధీ,ఆటో శ్రీను, నడుపురి రమణ, పెయ్యల సిద్ధార్థ, ఉదయ్ కుమార్, నాని, జగన్, చైతన్య, శ్రీధర్, బాబూరావు, మధు బాబు, హనుమంత రావు, యూవిరావ్, నందికోళ్ళ శ్రీధర్,ఎన్. కృష్ణ, పి.శోలే తదితరులు పాల్గొన్నారు.

About The Author: SOMA RAJU

సోమరాజు గుమ్మడి, విశాఖపట్నం జిల్లా కు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. రెవిన్యూ, విద్య, ఆరోగ్యం, సామజిక  రంగాలకు సంబంధించి  ఆయనకు జర్నలిజంలో 3 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది.