బొర్రంపాలెం గ్రామంలో డా.బి.ఆర్ అంబెడ్కర్ 134వ జయంతిని పురస్కరించుకుని ప్రముఖ సామాజిక వేత్త , వైస్సార్ సి పి యువ నాయకులు పెండ్యాల అభిషేక్ బాబు అంబెడ్కర్ యూత్ ఆధ్వర్యంలో అంబెడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
తదనంతరం అంబెడ్కర్ గురించి ఆయనమాట్లాడుతూ అంబెడ్కర్ దేశంలోఉన్నఅస్పృశ్యతలను,అంటరానితనాన్ని రూపుమాపి బహుజనుల జీవితాల్లో వెలుగులు నింపారని,ప్రపంచమే మేచ్ఛతగ్గా రాజ్యాంగాన్ని దేశానికి అందించిన గొప్ప మేధావి అని ,అంబెడ్కర్ చూపించిన మార్గాన్ని అందరూ భావితరాలకు అందించాలని అన్నారు. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పైన నిన్న విజయవాడ బస్సు యాత్రలో దుష్టచతుష్టయం చేయించిన భౌతిక దాడిని
ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న యావత్ ప్రజాల పై జరిగిన దాడిగా అభిషేక్ బాబు అభివర్ణించారు.అంతేకాదు ఈ దుశ్చర్యను ముక్తకంఠంతో అందరూ ఖండించాలని అన్నారు.
ఆంధ్రరాష్ట్రంలోనే కాదు దేశంలోనే భౌతిక దాడులకు పాల్పడటం రాజ్యాంగ విరుద్దమని, ఇది హేయమైన చర్య అని ప్రజలు ఇటువంటి పిరికిపంధ చర్యలను ప్రజలు విశ్వచించటం లేదని ,వారి గోతిని వాళ్లే తీసుకున్నారని ఎద్దేవాచేశారు. జగన్ వైస్సార్ సి పి ఈ ఎన్నికల్లో విజయ దుందుభి మోగిస్తారని అప్పటి వరకు వైస్సార్ సిపి నాయకులు, కార్యకర్తలు, వైస్సార్ కుటుంబ సభ్యులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో గుండె పాండురంగ, కొనకళ్సర్వేశ్వరావు, బత్తుల రమేష్,కర్రె జక్కయ్య, చిల్లర ప్రకాశరావు,కొండ్రు గాంధీ,గుండె చిట్టియ్య,ముల్కీ శ్రీను తదితరులు పాల్గొన్నారు.
బహుజనుల జీవితంలో వెలుగు నింపిన డా.బిఆర్ అంబేద్కర్
టి.నర్సాపురం