విశాఖ సిటి, పెన్ పవర్, న్యూస్ ఆగస్టు 03 : గురుద్వార్ దగ్గర నుంచి బెంగళూరు లేమి నేషన్ సీట్లు లోడుతో వెళ్తున్న వ్యాన్ ఎన్ఏడి వంతెన పైన గాజువాక వైపునకు వెళ్లే టర్నింగ్ లో వ్యాన్ లో ఉన్న లోడ్ ఒకవైపుకు జారిపోవడంతో డీసీఎం వ్యాన్ అదుపుతప్పి బోల్తా పడింది. సమాచారం అందుకున్న కంచరపాలెం ట్రాఫిక్ పోలీసులు ఎస్సై బాలరాజు ఘటనా స్థలానికి చేరుకొని వ్యాన్ లో ఉన్న లామినేషన్ సీట్లను వేరే లారీల్లోకి ఎక్కించి క్రేన్ సహాయంతో వ్యానును తొలగించే సహాయక చర్యలు చేపట్టి ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా క్రమబద్ధీకరిస్తున్నారు. ఈ ప్రమాదంలో డ్రైవర్ ఓ సూరి కొండలరావు ఎటువంటి గాయాలు కాకుండా బయటపడడం ఎటువంటి ప్రాణం నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు