అనధికార రక్తదాన శిబిరాలు నిర్వహిస్తే కఠిన చర్యలు

స్టాఫ్ రిపోర్టర్,పాడేరు/గూడెం కొత్తవీధి,పెన్ పవర్,జూలై 4: గిరిజన ప్రాంతంలో అనధికార రక్తదాన శిబిరాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ఎ.ఎస్.దినేష్ కుమార్ హెచ్చరించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మైదాన ప్రాంతం నుండి రక్త సేకరణ సంస్థలు ఏజెన్సీలో పర్యటించి రక్త సేకరణ చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ సంస్థ మాత్రమే జిల్లాలో రక్త దాన శిబిరాలు నిర్వహించాలని స్పష్టం చేసారు.జిల్లాలో నెలకు ఎంత మేరకు రక్తం అవసరమవుతుందని రెడ్ క్రాస్ బృందాన్ని అడిగి తెలుసుకున్నారు.పాడేరు,రంప చోడవరం,చింతూరులలో జనరిక్ మందుల షాపు ఏర్పాటు చేస్తామన్నారు. చింతూరులో ఉన్న పాత రెడ్ క్రాస్ భవనాన్ని మరమ్మతులు చేస్తామన్నారు.జనరిక్ మందులు షాపులు,చింతూరు రెడ్ క్రాస్ భవనం మరమ్మతులకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు.రక్తదానం చేయడానికి దాతలను గుర్తించాలని సూచించారు. రక్తదానంపై ప్రజలను చైతన్యవంతం చేయాలని స్పష్టం చేసారు.నెలకు రెండువందల యూనిట్ల వరకు రక్తం అవసరమవుతుందని రెడ్ బృందం జిల్లా కలెక్టర్ కు వివరించారు.మరో వెయ్యిమంది రక్తదాతలను గుర్తించాలని చెప్పారు.రక్త నిల్వ చేయడానికి ఉన్న సామర్ధాలను అడిగి తెలుసు కున్నారు.ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. జమాల్ భాషా,రెడ్ క్రాస్ సభ్యులు సూర్యారావు, జయలక్ష్మి,ఫార్మాసిస్ట్ సంజీవ్, గౌరీ శంకర్,జిల్లా కో ఆర్డినేటర్ లోహితాస్, బ్లడ్ బ్యాంకు ఎల్.టిలు వెంకట్, సతీష్, తదితరులు పాల్గొన్నారు.

ఆరోగ్యం

About The Author: CHANTI BABU MADHIRI

అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు.  జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.